Delhi Car Blast: ఢిల్లీలో చోటు చేసుకున్న కారు పేలుడుకు సంబంధించిన ఘటనలో దర్యాప్తు సంస్థల విచారణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే బృందాలుగా విడిపోయిన దర్యాప్తు సంస్థలు ప్రతి అంశాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన కీలక విషయాలను బయటపెడుతున్నాయి. అయితే ఇందులో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఇంటిలిజెన్స్ వర్గాలను మాత్రమే కాకుండా.. యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో ఉగ్రవాది ఉమర్ కీలకపాత్ర పోషించాడు. అతడు కారులో భారీగా పేలుడు పదార్థాలను డంపు చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత దాదాపు గంటల తరబడి అక్కడే ఉన్నాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. కారు కూడా పేలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది దాకా చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టాయి. అయితే ఇందులో ప్రతి అంశాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఘటనలో పేలుడు పదార్థాలను ఫరీదాబాద్ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో తయారు చేశారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఉమర్ ఆ యూనివర్సిటీలో ఒక వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఉగ్రవాదుల మత బోధనలకు ఆకర్షితుడై మానవ మృగంలాగా తయారయ్యాడు. చివరికి తనను తాను పేల్చివేసుకుని.. చాలామంది మరణానికి కారణమయ్యాడు. అయితే ఇతడు ఆ పేలుడు పదార్థాలను యూనివర్సిటీ నుంచి తెప్పించినప్పటికీ.. వాటిని పేలే విధంగా చేసింది మాత్రం సంఘటన స్థలంలోనే నట.
పేలుడు చోటు చేసుకున్న ప్రాంతంలో ఉమర్ దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలోనే బాంబు తయారు చేశాడు. ఈ ఐడి తయారీలో ఉమర్ శిక్షణ పొందాడు. తాను శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు చేశాడు. పేలుడు పదార్థాలను పరిమితంగా తీసుకురావడంతో.. దాని తీవ్రత ఒక స్థాయి వరకే ఉంది. ఒకవేళ భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగించి ఉంటే పేలుడు తీవ్రత అధికంగా ఉండేదని.. చాలామంది చనిపోయి ఉండేవారని దర్యాప్తు సంస్థల అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఉమర్ మూడు గంటల పాటు కారులో ఏం చేశాడు అనే ప్రశ్నకు అధికారులకు నిన్నటి వరకు సమాధానం తెలియలేదు. సీసీ కెమెరాలు.. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు ఈ విషయాన్ని బయట పెట్టారు.