Rashmika Mandanna Comments On Vijay Deverakonda: రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) చిత్రం రీసెంట్ గానే భారీ లెవెల్ లో విడుదలై మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు ఈ సినిమా పై అంచనాలు పెద్దగా లేవు కానీ, విడుదల తర్వాత మాత్రం యూత్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది ఈ చిత్రం. ఈమధ్య కాలం లో ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదు. నటుడిగా ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరో పక్క దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రం తో తన సత్తా చాటి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
ఇకపోతే ఈ ఈవెంట్ లో రష్మిక మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఒక పక్క చాలా సంతోషంగా ఉంది, మరోపక్క మన సమాజం లో ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి సంఘటనలు నా నిజ జీవితం లో కూడా జరిగాయి. కేవలం నాకు మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరి జీవితం లో ఒక వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే ఉంటాయి. అలాంటి సమయం లో అమ్మాయి మనసులో ఏముందో అర్థం చేసుకొని రాహుల్ తెరకెక్కించిన తీరు అద్భుతం. ఒక అబ్బాయి అమ్మాయి మనస్సు ని ఇంతలా అర్థం చేసుకుంటాడా అని రాహుల్ ని చూసిన తర్వాతే తెలిసింది. ఇక సినిమాలో దీక్షిత్ క్యారక్టర్ ని చూస్తే మీకు కోపం రావొచ్చేమో కానీ, నిజ జీవితంలో అతను బంగారం లాంటి మనిషి’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
ఇక చివర్లో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ‘విజయ్..ఈ సినిమా లో నువ్వు కూడా భాగమే. స్క్రిప్ట్ ప్రారంభ దశ నుండి అన్నీ దగ్గరుండి చూస్తేనే ఉన్నావు. ఈ సినిమాకు నువ్వు ఇచ్చిన ప్రోత్సాహం మామూలుది కాదు. నేను కోరుకుంటున్నా, ప్రతీ అమ్మాయి జీవితం లో నీలాంటి గొప్ప మనిషి ఉండాలని’ అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక మాట్లాడిన ఈ మాటలకు ఈవెంట్ కి వచ్చిన అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలా నిన్నటి ఈ సక్సెస్ ఈవెంట్ ఆడియన్స్ కి ఒక కనుల పండుగ లాగా అనిపించింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న రష్మిక స్పీచ్ ని మీరు కూడా చూసేయండి.