Homeఅప్పటి ముచ్చట్లుShakeela: మోహన్‌లాల్, మమ్ముట్టి మధ్యలో "ఆమె" ఓ తుఫాన్.. మలయాళ సినిమాను కుదిపేసిన ఆ రోజులు

Shakeela: మోహన్‌లాల్, మమ్ముట్టి మధ్యలో “ఆమె” ఓ తుఫాన్.. మలయాళ సినిమాను కుదిపేసిన ఆ రోజులు

Shakeela: మోహన్లాల్ ది కంప్లీట్ యాక్టర్.. మమ్ముట్టి మెగాస్టార్.. వీళ్లు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. వందల కోట్లు వసూలు చేస్తూనే ఉన్నారు. యంగ్ జనరేషన్ సైతం వీళ్ళతో పోటీ పడలేకపోతోంది. మోహన్లాల్ దృశ్యం ఎంతటి సంచలనమో చెప్పాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి భ్రమయుగం ఏ స్థాయిలో ఆడిందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ఒకప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే నాటి కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను […]

Shakeela: మోహన్లాల్ ది కంప్లీట్ యాక్టర్.. మమ్ముట్టి మెగాస్టార్.. వీళ్లు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. వందల కోట్లు వసూలు చేస్తూనే ఉన్నారు. యంగ్ జనరేషన్ సైతం వీళ్ళతో పోటీ పడలేకపోతోంది. మోహన్లాల్ దృశ్యం ఎంతటి సంచలనమో చెప్పాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి భ్రమయుగం ఏ స్థాయిలో ఆడిందో చెప్పాల్సిన పనిలేదు.

కానీ ఒకప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే నాటి కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇదే సమయంలో ఎటువంటి నేపథ్యం లేని ఒక నటి నటించిన 12 లక్షల బడ్జెట్ సినిమా ఏకంగా నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది మలయాళ చిత్ర నిర్మాతలను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక జానర్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ లాగా నిలిచింది. మలయాళ చిత్ర పరిశ్రమను దాదాపుగా ఆమె ఏలింది. ఆమె నటించిన చిత్రాలు కుటుంబం మొత్తం చూసేవి కాదు. కానీ ఒక వర్గాన్ని మాత్రం ఆమె పూర్తిస్థాయిలో రంజింపజేసింది. ఆమె పేరుతోనే ఒక బ్రాండ్ ఏర్పడింది. ఆ సినిమాలు ఇతర భాషల్లోకి కూడా అనువదించారు. ఫలితంగా ఆమె మార్కెట్ అన్ని రాష్ట్రాలను దాటింది. ఆమె పేరు చెప్తే చాలు ఫలనా సినిమా అనే స్థాయికి ఆమె రేంజ్ ఎదిగిపోయింది.

మమ్ముట్టి.. మోహన్లాల్ వంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టిన ఆ నటి పేరు షకీలా. ఈ పేరు చెప్తే రహ హృదయాలు ఉప్పొంగి పోతాయి. కొంటె వయసు వారి కోరికలు చెలరేగిపోతాయి. ఆమె స్క్రీన్ మీద కనిపించినప్పుడు.. ఆమె అందచందాలతో అలరిస్తున్నప్పుడు చూసే వాళ్లకు స్వర్గంలో విహరించినట్టుగా ఉండేది. ఆమెను చూస్తే మైకంలో మునిగినట్టు ఉండేది. ఆమె ఒక రసహృదయ దేవత. ఎంతోమందికి ఓదార్పును.. తృప్తిని అందించిన నటీమణి.

జయం సినిమాలో కాలేజీలో అధ్యాపకురాలి పాత్రలో నటించినప్పుడు కేవలం ఆమెను చూసేందుకే చాలామంది ఆ సినిమాకి వెళ్లారు. ఇది చాలు షకీలా రేంజ్ ఏమిటో చెప్పడానికి. మలయాళం.. తమిళం.. కన్నడ.. ఇంకా అనేక భాషల్లో ఆమె నటించింది. ఎంతో సంపాదించింది. కానీ అయిన వాళ్ళ మోసం వల్ల రోడ్డున పడింది. వారు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయింది. చివరికి మళ్లీ తన జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెట్టింది. ఒంటరి జీవితం.. అయినవాళ్లు డబ్బు కోసం ఆమెను ఆగం చేశారు. కానీ శ్రేయోభిలాషులు ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఇదే క్రమంలో ఆమె సోషల్ మీడియాకు బానిసయింది. అదే పనిగా రీల్స్ చూడడంతో చివరికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఇటీవల తనకు ఎదురైన పరిస్థితిని సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా బయటపెట్టింది.

వాస్తవానికి షకీలా కు ఎటువంటి నేపథ్యం లేదు. గాడ్ ఫాదర్ లు లేరు. ఫాదర్ అంతకంటే లేదు. అటువంటి స్థితి నుంచి మలయాళ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఆమె ఎదిగిందంటే మాటలు కాదు. మమ్ముట్టికి.. మోహన్లాల్ కి మలయాళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మార్కెట్ ఉంది. అంతటి గొప్ప గొప్ప నటులు కూడా షకీలా ముందు తేలిపోయారంటే ఆమె ఏ స్థాయిలో విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వర్గం సినిమాలకు మాత్రమే షకీలా పరిమితం కాలేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి వచ్చింది. అక్కడ కూడా తనను తాను ప్రూఫ్ చేసుకుంది. కాకపోతే తన గతానికి సంబంధించిన పాత్రలే ఇందులో కూడా వచ్చాయి. ఆమెది ఎక్కడైనా నటనే కాబట్టి.. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా నటించింది. తనను తాను నిరూపించుకుంది. ఇప్పుడంటే ఆమెకు అవకాశాలు లేకపోవచ్చు. కానీ ఒకప్పటి ఆమె రేంజ్ కాల్చుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సైతం వణుకు పుడుతుంది. దానినే మలయాళ చిత్ర పరిశ్రమలో షకీలా వేవ్ అంటారు. వేవ్ అంటే అర్థమేంటో తెలుసు కదా.. ప్రళయం.. షకీలా సృష్టించిన ప్రళయం ఎలాంటిదో గూగుల్ లో కొడితే తెలుస్తుంది. 2000 దశకంలో కేరళ ప్రజలను అడిగితే అర్థమవుతుంది. దట్ ఇస్ షకీలా.. ది బ్రాండ్ ఆఫ్ “ఏ సర్టిఫికెట్ సినిమా” ఫైర్

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper