Dhurandhar vs Dies Irae : ఒక సినిమా సక్సెస్ అనేది ఆ మూవీకి వర్క్ చేసే అన్ని క్రాఫ్ట్ ల మీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడు మంచి కథను రాసుకొని దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినంత మాత్రాన సినిమా సక్సెస్ అయిపోదు. దానికి మ్యూజిక్ బాగుండాలి, ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉండాలి. ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా సన్నివేశాలన్నీ ఎంగేజింగ్ గా ఉన్నప్పుడే సినిమా సక్సెస్ ని సాధిస్తోంది…రీసెంట్ టైమ్ లో వచ్చిన సినిమాలు కొన్ని సక్సెస్ అవుతుంటే, మరికొన్ని ఫ్లాపు లుగా మారుతున్నాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘దురంధర్’ సినిమా 3 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే మూవీ ఇంకా బాగుండేదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి… ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన దురంధర్ సినిమా ఎడిటింగ్ ఎలా ఉండకూడదో నేర్పిస్తే, మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘ డీయస్ ఇరే’ సినిమా సౌండ్ డిజైనింగ్ ఎలా ఉండాలో చూపించింది… నిజానికి ఈమధ్య బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే రణగొణ ధ్వనుల మధ్య ప్రేక్షకుడి చెవులు పగిలిపోయేలా డ్రమ్స్ వాయిస్తూ ఆడియన్స్ గుండెలదిరెలా సౌండ్ మ్యూజిక్ ఉన్నప్పుడే సినిమా ఎక్కుతోంది అనే రేంజ్ లో మన మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు… దీనివల్ల కొంతమంది సినిమాకి కనెక్ట్ అయితే మరి కొంతమంది ఆ ధ్వనులను వినలేక థియేటర్ నుంచి బయటికి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి… అలా కాకుండా ఒక సౌండ్ డిజైనింగ్ చేసినప్పుడు మాత్రమే సినిమాకి ఎఫెక్ట్ వస్తోందనే విషయాన్ని మన మ్యూజిక్ డైరెక్టర్లు తెలుసుకోవడం లేదు. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన డీయస్ ఇరే అనే మూవీ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో ప్రతి సౌండ్ కూడా ప్రేక్షకుడి యొక్క దృష్టిని ఆకర్షించింది. భారీ సౌండ్ లేకుండా ఆకులు కదిలిన సౌండ్, మనిషి నడుస్తున్న సౌండ్, కిటికీ డోర్ కొట్టుకుంటున్న సౌండ్… అలాగే అక్కడక్కడ నిశ్శబ్దంగా ఉండే విజువల్స్ కూడా ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేశాయి…
హారర్ సినిమాలో సౌండింగ్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తోంది. సడన్ పక్షులు అరిచిన సౌండ్ రావడం, ఇతర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లను వేసి ప్రేక్షకుడిని భయపెట్టాలి అనుకుంటారు. కానీ ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్ మాత్రం నాచురల్ సౌండ్స్ ను కొంచెం ఎఫెక్ట్ గా ప్రజెంట్ చేసి ప్రేక్షకుల్లో ఒక హర్రర్ ని క్రియేట్ చేశాడు…
ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉన్నప్పుడు ప్రేక్షకులు ఆటోమేటిగ్గా సినిమా చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. తను ఇంతకుముందు చేసిన ‘బ్రమయుగం’ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మోహన్ లాల్ కొడుకు అయిన ప్రణవ్ మోహన్ లాల్ సినిమా చేశాడు… బ్రమ యుగం అంత భారీ రేంజ్ లో ఈ సినిమా లేకపోయినా కూడా హారర్ జానర్ కి మాత్రం న్యాయం చేసిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు సైతం బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సౌండ్స్ సినిమాకి చాలా బాగా ప్ల అయ్యాయి… ఇప్పటికైనా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే చెవులు పగిలిపోయేలా సౌండ్ కొట్టడం కాదు. ఆ సీన్ కి ఏ మ్యూజిక్ అవసరమో దాన్ని కొంచెం ఎఫెక్టివ్ గా నేచురల్ వేలో ప్రజెంట్ చేస్తే సరిపోతుందనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది…