Loka movie : ఈ ఫొటోలో అద్దాలు పెట్టుకొని బొద్దుగా, చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?, ఈమె తండ్రి ఒక ప్రముఖ దర్శకుడు. బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీస్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తో కలిసి పని చేసాడు. మన టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున తో కూడా ఒక సినిమా చేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కానీ, కాలక్రమేణా టీవీ టెలికాస్ట్ లో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అలా ఎన్నో వందల సినిమాలను తెరకెక్కించిన లెజండరీ డైరెక్టర్ కూతురుగా 2017 వ సంవత్సరం లో మన తెలుగు సినిమా ద్వారానే వెండితెర కి పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, రీసెంట్ గానే లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఆమె మరెవరో కాదు, కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan). ఈమె తండ్రి పేరు ప్రియదర్శన్, పాపులర్ డైరెక్టర్. చిన్నతనం లో ఎలా ఉన్నిందో, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఎంత అందంగా తయారైందో మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా. ఈమె అక్కినేని అఖిల్ హీరో గా నటించిన రెండవ చిత్రం ‘హల్లో’ ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘చిత్రలహరి’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె తెలుగు లో పెద్దగా నటించలేదు కానీ, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తన కెరీర్ ని కొనసాగించింది.
ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ని కూడా అందుకుంది. అలా కెరీర్ ని కొనసాగిస్తున్న ఈమె, రీసెంట్ గానే ‘లోక’ అనే చిత్రం తో సృష్టించిన ప్రభంజనాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగులో కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. మన సౌత్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. మలయాళం లో మమ్మూటీ, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ కి కూడా సాధ్యపడని 300 కోట్ల గ్రాస్ ని కళ్యాణి ప్రియదర్శన్ కేవలం ఒక్క సినిమాతో తెచ్చుకొని చూపించింది. రాబోయే రోజుల్లో ఈమె ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.