Mohanlal Movie Strategy: మలయాళం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. స్వతహాగా ఒక సినిమా కోసం 35 కోట్ల రెమ్యూనషన్స్ తీసుకునే మోహన్ లాల్ ఒక సినిమా కథ నచ్చితే మాత్రం ఆ కంటెంట్ కోసం పారితోషికాన్ని తగ్గించుకొని మరి ఆ సినిమాను చేస్తాడు…ఇక రీసెంట్ గా వచ్చిన ‘ తుడరుమ్ ‘ అనే సినిమాను కేవలం 30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ మూవీ కోసం మోహన్ లాల్ కేవలం నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడు. ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి దాదాపు 250 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టింది. దాంతో ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది… ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు హీరోలు సైతం భారీ రెమ్యూనరేషన్స్ ను తీసుకుంటూ పెద్ద సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించడం లేదు. కంటెంట్ బాగున్న ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పారితోషికాన్ని భారీగా తగ్గించుకొని మోహన్ లాల్ ఏ విధంగా అయితే సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడో అలాంటి ఒక సినిమాను ప్రతి ఒక్క స్టార్ హీరో చేస్తే ఇండస్ట్రీకి భారీ లాభాలు వస్తాయి.
Also Read: తప్పలేదుగా.. రేవంత్ రెడ్డిని శరణువేడిన టాలీవుడ్…
తద్వారా ఇండస్ట్రీ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగే అవకాశాలైతే ఉంటాయి. కానీ ఇలాంటివి మన హీరోలు చేయరు. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ భారీ రేంజ్ లో ఉంది. కాబట్టి వాళ్ళ మార్కెట్ ను తగ్గించుకొని లో బడ్జెట్ లో సినిమా చేస్తే వాళ్ళ సినిమా కెరియర్ మీదనే కాకుండా వాళ్ళ పర్సనల్ కెరియర్ మీద కూడా అది ఇంపాక్ట్ ను చూపించవచ్చనే ఉద్దేశ్యంతో మన హీరోలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం లేదు.
ఒకవేళ మన వాళ్ళు కనక ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసినట్లయితే మాత్రం సినిమా ఇండస్ట్రీ చాలా బాగుపడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాగే డిఫరెంట్ కథలు వస్తాయి. అలాగే మన హీరోలను సైతం డిఫరెంట్ క్యారెక్టర్లలో మనం చూడొచ్చు.
Also Read: కమల్ హాసన్ ఒక్కసారి కూడా రజినీకాంత్ ను బీట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే..?
దాని ద్వారా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ పెరగడమే కాకుండా అవార్డ్స్ ని కూడా ఎక్కువ సంఖ్యలో పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా చేస్తే మలయాళం ఇండస్ట్రీతో పోలిస్తే మన సినిమాలు కంటెంట్ వైజ్ గా కూడా చాలా గొప్ప రేంజ్ కి వెళతాయని చెప్పచ్చు. ఇలాంటివి చేయలేకనే మన హీరోలు ఇతర భాషల హీరోల కంటే కూడా చాలా వెనుకబడిపోతున్నారు. వీటిని కనక ఎంకరేజ్ చేసినట్లయితే మన ఇండస్ట్రీ కంటెంట్ పరంగా కూడా టాప్ లెవెల్ కి వెళ్తుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…