Homeఅత్యంత ప్రజాదరణSai Pallavi Dares : అప్పుడు పవన్ ఇప్పుడు నాని.. ఏంటిది సాయి పల్లవి !

Sai Pallavi Dares : అప్పుడు పవన్ ఇప్పుడు నాని.. ఏంటిది సాయి పల్లవి !

సాయి పల్లవి (Sai Pallavi) మెరుపుతీగలా వెండితెర పై కదులుతుంటే.. ప్రేక్షకులు ఫిదా అయిపోతూ 100ల మిలియన్ల వ్యూస్ ను ఆమె నాట్యానికి ధారాదత్తం చేస్తున్నారు. అందుకే, సాయి పల్లవి కోసం స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఆమెను తమ సినిమాలో పెట్టుకోవాలని తెగ ఉబలాట పడుతున్నారు. కానీ, సాయి పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయితే, ఈ ఏడాది సాయి పల్లవి నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ కావాల్సింది. […]

Sai Pallaviసాయి పల్లవి (Sai Pallavi) మెరుపుతీగలా వెండితెర పై కదులుతుంటే.. ప్రేక్షకులు ఫిదా అయిపోతూ 100ల మిలియన్ల వ్యూస్ ను ఆమె నాట్యానికి ధారాదత్తం చేస్తున్నారు. అందుకే, సాయి పల్లవి కోసం స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఆమెను తమ సినిమాలో పెట్టుకోవాలని తెగ ఉబలాట పడుతున్నారు. కానీ, సాయి పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలు చేసుకుంటూ పోతుంది.

అయితే, ఈ ఏడాది సాయి పల్లవి నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ కావాల్సింది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ప్రపంచమే తారుమారు అయిన పరిస్థితులు ఉన్నాయి. ఐతే, ఈ రెండు మూడు నెలల్లో సాయి పల్లవి నుండి వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. సాయి పల్లవి నటించిన క్రేజీ మూవీ ‘లవ్ స్టోరీ’ విడుదల తేదీ ఖరారు అయింది.

శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాలో నాగ చైతన్య హీరో అయినప్పటికీ.. ఈ సినిమాకి సంబంధించి క్రేజ్ మొత్తం సాయి పల్లవిదే. కేవలం సాయి పల్లవి వల్లే ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఎందుకంటే సాయి పల్లవి డ్యాన్స్ కారణంగా ఈ సినిమా సాంగ్ ‘సారంగ దరియా’ పాట 100 మిలియన్ల వ్యూస్ ను దాటింది.

అలాగే సాయిపల్లవి చేస్తున్న మరో క్రేజీ మూవీ ‘విరాటపర్వం’. రానా హీరోగా రానున్న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేలా లేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కి ఆల్రెడీ అమ్మేశారు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కానీ, ఈ విషయం పై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మొత్తానికి సాయి పల్లవి నుండి ఈ రెండు మూడు నెలల్లోనే రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరోపక్క ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాతే.. తాను తెలుగులో కొత్తగా సినిమాలు ఒప్పుకుంటాను అంటూ.. సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ ను కూడా వదులుకుంది. అలాగే తాజాగా నాని కొత్త సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. ఏది ఏమైనా పవన్ తో పాటు నాని (Nani) సినిమాకి కూడా సాయి పల్లవి నో చెప్పడం ఆశ్చర్యమే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper