నారా లోకేష్ ను ఇప్పటికీ తండ్రిచాటు బిడ్డగానే చూస్తుంటారు చాలా మంది. టీడీపీ భావినేతగా లోకేష్ ను చూపించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై సెటైర్లు కూడా వినిపిస్తుంటాయి. జాకీలు పెట్టి లేపినా.. లేవట్లేదంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతుంటాయి. నిక్ నేమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్ర నుంచి బయటపడేందుకు లోకేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా మొదటగా బాడీ షేప్ ఛేంజ్ చేశారు. తిండి తగ్గించారో.. కసరత్తులు పెంచారోకానీ.. మొత్తానికి దేహాన్ని కరిగించేశారు. స్లిమ్ గా తయారైపోయారు. క్లీన్ షేవ్ ప్లేసులో గుబురు గడ్డం పెంచడం మొదలు పెట్టారు. ఆ విధంగా.. క్లాస్ కాదు, మాస్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయినా కానీ.. ఎక్కడో వెలితి. కటౌట్ రెడీ చేస్తే సరిపోదు కదా.. దానికి తగిన కంటెంట్ కూడా ఉండాలి మరి. చాలా మంది గమనించి ఉండరుగానీ.. ఈ కంటెంట్ కోసం లోకేష్ ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
రాజకీయాల్లో ప్రతిదానికీ షార్ట్ కట్ ఉంటుంది. ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి, ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉన్నట్టు.. పోరాటాలు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనకుండానే మాస్ లీడర్ అయిపోవచ్చు. దీనికి ఉన్న షార్ట్ కట్ ఏమంటే.. జైలుకు వెళ్లిరావడం. ఒక్కసారి జైలుకు వెళ్లి వస్తే నా సామిరంగా.. ఎవ్వరైనా సరే లీడర్ అయిపోవచ్చు అనే ఫీలింగ్ ఒకటి ఏర్పడింది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో.
జగన్ ను జైల్లో పెట్టకపోతే.. ఇంత పెద్ద లీడర్ అయ్యేవారు కాదన్నది పలువురు విశ్లేషకుల మాట. ఇదే జైలుకు వెళ్లిరాకపోతే.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కేది కాదన్నది అదే విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కళ్ల ముందు కనిపిస్తుండడంతో.. ఊరమాస్ నేతగా ఎదగాలని భావించే వారంతా ఈ షార్ట్ కట్ ను సెలక్ట్ చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇలాంటి వారి జాబితాలో నారా లోకేష్ కూడా ఉన్నారన్న వాదన ఏడాది కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో.. అరెస్టు కావడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా? అని ఎదురు చూస్తున్నారట. లోకేష్ స్పీచ్ లో వచ్చిన మార్పునకు కూడా కారణం ఇదేనని అంటారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పై ఏకవచనంతో భారీ డైలాగులు పేల్చడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు లోకేష్. ఇలాంటి లోకేష్ కు ఏపీలో జరిగిన రమ్య హత్య సందర్భం కలిసి వచ్చిందనే ప్రచారం సాగుతోంది.
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్, టీడీపీ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ విధంగా.. అరెస్టు కావాలన్న లోకేష్ కోరిక తీరిందని అంటున్నారు. పోలీసులు అరెస్టు చేశారు.. విడుదల కూడా చేశారు. మరి, ఆశించిన ఇమేజ్ వచ్చిందా? రేపటి నుంచి ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతారు? మరింత దూకుడుతో రాజకీయం చేస్తారా? అని తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు.. పాత లోకేష్ ను, ప్రస్తుత లోకేష్ ను పోల్చి చూసుకుంటూ.. మీరు మారిపోయారు సార్ అని అనేసుకుంటున్నారు. మరి, ఈ మార్పు మంచికేనా? దాని ప్రభావం ఎంత? అన్నదానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nara lokesh changed his political strategy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com