spot_img
Homeఅత్యంత ప్రజాదరణహస్తినలో కేసీఆర్ పోరాటం చేస్తారా? సడన్ టూర్ వెనుక మర్మమెంటీ?

హస్తినలో కేసీఆర్ పోరాటం చేస్తారా? సడన్ టూర్ వెనుక మర్మమెంటీ?

KCR
రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. దుబ్బాక.. గ్రేటర్లో కారు స్పీడుకు కమలదళం బ్రేక్ వేయడంతో సీఎం కేసీఆర్ బీజేపీపై కన్నెర్ర చేశారు. కేంద్రంలోని బీజేపీపై పోరుకు భారత్ బంద్ సాక్షిగా శ్రీకారం చుట్టారు. అయితే ఉన్నట్లుండి ఆయన ఢిల్లీ టూరుకు వెళుతుండటం వెనుక మర్మమెంటోననే ఆసక్తి నెలకొంది.

Also Read: ‘జమిలి’కి సై అంటున్న కేంద్రం.. 2022లో దేశవ్యాప్త ఎన్నికలు?

సీఎం కేసీఆర్ నేడు హస్తినకు వెళ్లనున్నారు. అక్కడే మూడురోజులపాటు మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ సీఎంవో ప్రధాని అపాయింట్మెంట్ కోరిడం కేసీఆర్ రాజకీయ వ్యూహాంలో భాగమనే తెలుస్తోంది. ఇక టూరులో సీఎం కేసీఆర్ ప్రధాని కలుస్తారా? లేదా అనేది ఆసక్తిని రేపుతోంది.

సీఎం ఢిల్లీ టూరులో భాగంగా కేసీఆర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలు కేంద్ర మంత్రులను.. విపక్ష నాయకులతో భేటి కానున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేసేందుకు ఢిల్లీ వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం..! ఏర్పాట్లు రెడీ చేస్తున్న అధికారులు..

ఇక ఢిల్లీలో కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సీఎం కేసీఆర్ స్వయంగా మద్దతు తెలుపుతారనే టాక్ విన్పిస్తోంది. ఈమేరకు కేసీఆర్ రైతు సంఘాల నాయకులతో భేటి కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ ముందుగా రైతు సంఘాలతో మాట్లాడితే మాత్రం కేంద్రాన్ని ఢీకొట్టే సంకేతాలు వెళ్లడం ఖాయంగా కన్పిస్తోంది.

ఈ టూర్లో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారనే టాక్ విన్పిస్తోంది. ఒకవేళ ప్రధాని అపాయింట్ ఇస్తే మాత్రం ఆయనతో భేటి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నారు. ఏదిఏమైనా కేసీఆర్ సడన్ గా ఢిల్లీ వెళ్లనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper