Homeఅత్యంత ప్రజాదరణచేతిగోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

చేతిగోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

మనలో చాలామంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని భావిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియకుండానే మనల్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి.

సాధారణంగా రక్త పరీక్షల సహాయంతో ఆరోగ్య సమస్యల గురించి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే చేతి గోళ్లను పరిశీలించడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా వైద్య నిపుణులు సైతం చేతి గోళ్ల ద్వారా ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

సాధారణంగా గోళ్లు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. కొందరి గోళ్లు ఎంతో మృదువుగా ఉంటే మరి కొందరి గోళ్లు మాత్రం రఫ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరి చేతివేళ్లపై అర్ధచంద్రాకారంలో ఒక గుర్తు ఉంటుంది. ఈ గుర్తును లునులా అని పిలుస్తారు. ఈ లునులా దెబ్బ తింటే కొంతమంది గోళ్ల పెరుగుదల కూడా ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. చేతిగోళ్లపై ఎవరికైతే లూనులా ఉండదో వాళ్లు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి.

ఈ సమస్యలను అధిగమించడానికి తీసుకునే ఆహారపదర్థాలలో కూడా మార్పులు చేసుకుంటే మరీ మంచిది. లునులాపై ఎరుపు, పసుపు పచ్చ రంగులు వుంటే మాత్రం వాళ్లకు ఇతరులతో పోలిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లునులా నీలిరంగులో ఉంటే మాత్రం డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

లునులా మరీ చిన్నగా ఉంటే మాత్రం శరీరంలో విష పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయని అర్థం చేసుకోవాలి. గోళ్లపై లునులా లేని వాళ్లు వైద్యులను సంప్రదిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోళ్లు తెల్లగా ఉంటే మంచిదని గోళ్లు తెల్లగా లేకపోయినా వైద్యులను సంప్రదించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper