spot_img
Homeఅత్యంత ప్రజాదరణకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు.. ఎందుకంటే..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు.. ఎందుకంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో హోళీ పండుగ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద 4,500 రూపాయలు ఇచ్చిన కేంద్రం ప్రస్తుతం ఏకంగా 10,000 రూపాయల మొత్తాన్ని ఇస్తోంది.

ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద పొందిన మొత్తాన్ని నెలకు 1,000 రూపాయల చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైతే ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద నగదు తీసుకుంటారో వాళ్లు ఈ నెల 31వ తేదీ లోపు స్కీమ్ కింద డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద అందించే మొత్తానికి ఎటువంటి వడ్డీని వసూలు చేయదు. నెలకు కేవలం 1,000 రూపాయల చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను 6వ వేతన సంఘం కింద అమలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత ఉద్యోగులకు కేంద్రం ప్రీపెయిడ్ రూపే కార్డ్ రూపంలో ఈ రుణం పొందే అవకాశం కల్పించింది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఉద్యోగులకు అవసరమైతే పండుగల అడ్వాన్స్ లను ముందస్తుగా ఇవ్వవచ్చని చెబుతుండటం గమనార్హం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

మరోవైపు మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట కలిగేలా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం కేంద్రం డియర్‌నెస్ అలవెన్స్ తో పాటు డియర్‌నెస్ రిలీఫ్ ను పునరుద్ధరించనుందని తెలుస్తోంది. ఎవరైతే అవసరం ఉందని భావిస్తారో వాళ్లు ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper