spot_img
Homeఎడ్యుకేషన్Jobs: ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 135 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 135 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, జనరల్ హాస్పిటల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 135 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులతో పాటు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం.

Jobs
Jobs

18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఓబీజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనెస్థీషియా విభాగాలతో పాటు జనరల్ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

Also Read: KTR Tweets On Gujarat Power Cut: గుజార‌త్‌లో ప‌వ‌ర్ క‌ట్‌.. ఆటాడేసుకుంటున్న కేటీఆర్‌.. టైమింగ్ అంటే ఇదేనేమో..

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.1,25,000 వేతనంగా లభించనుంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తెలంగాణ/ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిష్టర్ కావడంతో పాటు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 52,000 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. http://osmaniamedicalcollege.org/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉండగా ఏప్రిల్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.

Also Read: Alia Bhatt And Ranbir Kapoor: ‘అలియా భట్’తో పెళ్లి పై స్టార్ హీరో రియాక్షన్

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper