AI : చేసిన పనికి వేతనం చెల్లించే విధానం కొన్ని వందల సంవత్సరాల నుంచి మనుగడలో ఉంది. కాకపోతే అది అనేక రకాల మార్పులకు గురవుతూ వస్తోంది. ఒకప్పుడు వస్తి మార్పిడి విధానం.. ఆ తర్వాత శ్రమకు శ్రమ విధానం అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత పనికి వేతనం చెల్లించడం.. ఆ తర్వాత చేసిన పనికి తగ్గట్టుగా వేతనం చెల్లించడం వంటివి అందుబాటులోకి వచ్చాయి. వేతన విషయంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. ఇప్పటికీ శ్రమకు తగ్గ వేతనం చెల్లించే విషయంలో సంస్థలు ఇప్పటికీ కప్పదాటు వ్యవహారాన్ని కొనసాగిస్తుంటాయి.. ఆయనప్పటికీ మన వ్యవస్థలు అటువంటి సంస్థలను ఏమీ చేయలేవు. ఎందుకంటే ప్రభుత్వాలలో ఉద్యోగాల లభ్యత అంతంత మాత్రం గానే ఉంటుంది. ప్రైవేట్ లో ఉద్యోగాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ సంస్థలను ఏమీ చేయలేవు.
Also Read : ఏఏఐ జాబ్ నోటిఫికేషన్.. 309 ఉద్యోగాలు భర్తీ.. అర్హతలు, దరఖాస్తు సమాచారం ఇదీ..
పూర్తిగా మారిపోతున్నది
మనదేశంలో దశాబ్దాలుగా మధ్య తరగతి వారికి “శాలరీ” వ్యవస్థ ఆర్థికంగా అండగా నిలిచింది. అయితే ఇది క్రమంగా కనుమరుగవుతున్నది. మన దేశం సరికొత్త ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తున్నది. వేతనం కోసం కాకుండా, ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు వస్తున్నాయి. అందువల్ల ఈ కాలంలో చదువు ఒకటి మాత్రమే సరిపోదు. చేసే పనిపై ప్రేమ ఉండాలి. దాని గురించి అన్ని తెలిసి ఉండాలి. చివరికి చేసే పనిలో నాణ్యతను ప్రదర్శించాలి. సమర్థతను చూపించాలి. లేకపోతే చేసే ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఇప్పుడున్న కాలంలో వందల మంది చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్షణంలోనే పూర్తిచేస్తుంది. దీనివల్ల ఆ వంద మందికి పని లేకుండా పోతోంది. మొత్తంగా చూస్తే ఎవరికీ గ్యారెంటీ లేని కాలంలోకి మనిషి వచ్చేసాడు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. కానీ ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుంటుందని నమ్మకం లేదు.
వచ్చే రోజులు మరింత దుర్భరం
భారతదేశంలో దశాబ్దాలుగా మధ్యతరగతి వారికి అండగా ఉన్న శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోంది. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జీయ వెల్లడించారు.” ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. జరుగుతున్న దానిని ఆపివేసే శక్తి లేదు. మార్పుకు గురికాకుంటే రేపటినాడు ఏమవుతుందనే భయం కళ్ళ ముందు కనిపిస్తోంది. మొత్తంగా పోటీ ప్రపంచంలో వేగంగా పరుగులు పెట్టకపోతే వెనుకబడి పోతామనే అపోహ ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల చాలా వరకు కోల్పోతున్నప్పటికీ.. ముందు వరుసలో లేకపోతే ఉన్నది కూడా పోతుందనే భయం విపరీతంగా ఉంది. అందువల్లే ఎవరికి ఎటువంటి గ్యారెంటీ లేదు. ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పుడున్న తరానికి చదువు మాత్రమే సరిపోదు. మిగతా లక్షణాలు కూడా నేర్చుకోవాలి. నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. రేపు అనే ప్రశ్నను ప్రతిక్షణం మననం చేసుకోవాలి. అప్పుడే కాస్త జీవితం నిశ్చింతగా ఉంటుందని” సౌరభ్ ముఖర్జీయ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఆయన చెప్పిన మాటలు భవిష్యత్తు కాలం నాటి ప్రమాద సూచికలను కళ్ళ ముందు ఉంచుతున్నాయి.
Also Read : AI మరింత చొచ్చుకు వస్తోంది.. ఇప్పుడు వంటింట్లోకీ ప్రవేశించి బిర్యానీ చేసేసింది.. వీడియో వైరల్