Horoscope Today: 2024 జూలై 7 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఆదివారం హర్షయోగం, వజ్ర యోగం వంటి ప్రభావాలతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉండనున్నాయి. మరోవైపు కొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు.
మేష రాశి:
వ్యాపారులు అంకిత భావంతో పని చేస్తారు. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి.
వృషభ రాశి:
మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అక్రమంగా డబ్బు సంపాదించాలని కొందరు సలహా ఇస్తారు. పట్టించుకోవద్దు. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి:
కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులపై ఇతరుల సలహాలు లీసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి:
వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు. మానసికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు.
సింహారాశి:
అసంపూర్ణ పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో ఎక్కువగా వాదనలు చేయొద్దు.
కన్య రాశి:
పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి:
కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు అందిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై ఆందోళన ఉంటుంది.
ధనస్సు రాశి:
ఉద్యోగులకు అధికారుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. శుభ కార్యక్రమాల గురించి చర్చించుకుంటారు. వ్యాపారులు ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు.
మకర రాశి:
లక్ష్యం వైపు పయనించేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. అంకిత భావంతో పనిచేస్తూ పెండింగు పనులు పూర్తి చేస్తారు. సంబంధాలు మెరుగుపడుతాయి.
కుంభరాశి:
ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆర్థిక విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు.
మీనరాశి:
ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉంటారు.ఉద్యోగులకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More