Homeలైఫ్ స్టైల్Horoscope Today: కుంభ రాశిలో శని తిరోగమణం.. ఈ 5 రాశుల వారికి ధన లాభం..

Horoscope Today: కుంభ రాశిలో శని తిరోగమణం.. ఈ 5 రాశుల వారికి ధన లాభం..

మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం.

Horoscope Today: 2024 జూన్ 29 శనివారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కుంభ రాశిలో శని తిరోగమనం చేయనున్నాడు. ఈ కారణంగా 5 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.

మేష రాశి:
అనవసర చిక్కుులు ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. కొత్త హక్కులను పొందుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి:
కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. సాయంత్రం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి:
కొన్ని పనులపై ఎక్కువ నిఘా ఉంచాలి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. గతంలో తీసుకున్న అప్పును ఈరోజు తిరిగి చెల్లిస్తారు.

కర్కాటక రాశి:
మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం.

సింహారాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులో భాగస్వాముల సహయంతో వియవంతంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు.

కన్య రాశి:
ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం మేలు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుుర్కొంటారు. టీచర్లకు పూర్తి సహకారం ఉంటుంది.

తుల రాశి:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆస్తిని కొనుగోలు చేయాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోరిక మేరకు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి:
బంధువుల నుంచి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడుతారు. ప్రతీచోట ప్రశంసలు ఉంటాయి.

ధనస్సు రాశి:
కొన్ని కొత్త వస్తువుల కొనుగోలు కోసం సమయం వెచ్చిస్తారు. ఆదాయాన్ని బట్టి ఖర్చులు పెంచుకోవాలి. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మకర రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. కటుుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం. పాత బకాయిలు పూర్తి చేస్తారు. రుణం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి:
రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల వాతావరణం. కొన్ని వివాదాలు చుట్టుముడుతాయి. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి.

మీనరాశి:
క్లిష్టమైన సమస్యలనుంచి బయటపడుతారు. వాహనం పాడైపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆస్తిని కొనగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper