లైఫ్ స్టైల్Chanakya Niti: విద్యార్ధుల కోసం చాణక్యుడు చెప్పిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసా ?

Chanakya Niti: విద్యార్ధుల కోసం చాణక్యుడు చెప్పిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసా ?

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు వంటి గొప్ప వారి నీతి సూక్తులు గురించి అందరికీ తెలిసిందే. చాణక్యుడు స్వతహాగా ఉపాధ్యాయుడు కావడంతో ఆయనకు విద్య ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. అపర మేధావిగా కీర్తి గడించిన ఆచార్య చాణక్యుడు… విద్య పట్ల ఆయన అపారమైన గౌరవాన్ని కలిగి ఉంటాడు. ఈ మేరకు ఎన్నో గ్రంథాలు ఆయన రచించడం జరిగింది. వాటిలో మనిషి జీవితం, నడవడిక, విజయ మార్గాలు, వంటి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆ గ్రంధాల్లో విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి అనేక కీలక సూచనలు కూడా చేశారు.

chanakya-niti-in-telugu
chanakya-niti-in-telugu

మనిషి జీవితంలో విద్యార్ధి దశ చాలా కీలకమైంది. వారి భవిష్యత్ బంగారుమయం కావాలంటే అందుకు పునాది వేసేది విద్యార్ధి దశే. ఈ మేరకు విద్యార్ధులు తమ విద్యకు సంబంధించి పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని చాణక్యుడు సూచించారు. వాటిని పాటించడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్తుకు మంచి బాట వేసుకోగలరని వివరించారు. ఆ సూచనలు ఎంతో మీకోసం ప్రత్యేకంగా…

జ్ఞానం, విద్య లేకుండా జీవితంలో విజయం సాధించడం అసాధ్యం. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా జ్ఞానాన్ని పొందాలని, దీని కోసం, ఎంత విలువైన వస్తువును అయినా త్యాగం చేయాల్సి వస్తే వెనుకాడొద్దని చాణక్యుడు చెప్పారు.

మనిషికి మంచి – చెడుల మధ్య తేడాను చెప్పేది విద్య. విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోని అభ్యసించాలి. విద్యాభ్యాసం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి జీవితంలో ఆటంకాలు, కష్టాలు ఎప్పటికీ తీరవు.

Also Read: Chanakya Niti: పిల్లల ముందు ఇలా ప్రవర్తిస్తున్నారా.. తల్లిదండ్రులు లైఫ్ లాంగ్ బాధ పడాల్సిందే?

విద్యను స్వీకరించడంలో క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ లేకుండా పూర్తి విద్యను పొందడం సాధ్యం కాదు. అలాగే, చెడు సహవాసం మీ చదువుకు పెద్ద అడ్డంకి. అందుకే చెడు సాంగత్యాన్ని వదిలేయాలి.

గురువు నుండి జ్ఞానాన్ని పొందే విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. జ్ఞానాన్ని తీసుకోవడానికి సిగ్గుపడే, సంకోచించే వ్యక్తి జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుంది. ఆ అసంపూర్ణ జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు.

Also Read: Chanakya Niti: చాణక్య నీతి: ఈ నాలుగు విషయాలలో సరిగ్గా ఉంటే కష్టాలు రావు!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: పెళ్లికి ముందే ఇవి నేర్చుకోవాలి.. లేదంటే కష్టాలేనట..

Chanakya Niti: భారతదేశ చరిత్రలో గొప్ప మేధావిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు జీవితంలో విజయాన్ని సాధించాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు చిన్న వయసులోనే అలవరచుకోవాలని సూచించాడు. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు వచ్చేలోపు...

Today horoscope in telugu 9.12.2025 ఈ రాశి వ్యాపారులకు ఈరోజు డబుల్ ధమాకా..

'Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఈరోజు ఏది అంటే అది జరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల...

Most Popular

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...
New smartphones launching April

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...
After Meal Tips

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...
Stress Relief

Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం..

Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే...