spot_img
Homeబిజినెస్Chicken Prices: మాంసాహారులకు షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

Chicken Prices: మాంసాహారులకు షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

Chicken Prices: మనలో చాలామంది మాంసాహారంను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం కిలో చికెన్ ధర 175 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం కిలో చికెన్ ధర 280 రూపాయలుగా ఉంది. మూడు వారాల వ్యవధిలో చికెన్ ధర 100 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెరగడం గమనార్హం. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

దేశంలో కరోనా భయం తగ్గడంతో అదే సమయంలో కోడి మాంసం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రతిరోజూ 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తుండగా ఆదివారం రోజున మాత్రం 15 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కోడిపిల్లలు మృత్యువాత పడుతుండటం గమనార్హం.

మరోవైపు కోళ్ల పెంపకానికి అవసరమైన దాణా ధరలు కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే దాణా ధర రెట్టింపైందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. నాటు కోడి, కడక్ నాథ్ కోళ్ల మాంసం కిలో 500 రూపాయల వరకు ఉంది. సాధారణ కోళ్లతో పోలిస్తే ఈ కోళ్లలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఈ కోళ్లపై చాలామంది ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

ఎండలు ముదిరితే చికెన్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం. చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వ్యాపారులు కూడా హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ తో చేసిన వంటకాల ధరలను పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper