Homeజాతీయ వార్తలుNarendra Modi : మోడీ జర్నలిస్టుల ప్రశ్నలకు భయపడతారా.. ప్రెస్ మీట్లకు అందుకే రారా.. అసలు...

Narendra Modi : మోడీ జర్నలిస్టుల ప్రశ్నలకు భయపడతారా.. ప్రెస్ మీట్లకు అందుకే రారా.. అసలు నిజమిదీ..

Narendra Modi : మోడీ విలేకరుల ముందుకు రారు. ధైర్యంగా మాట్లడలేరు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. మోడీ చేసేవి గొప్ప పనులు లేవు. అందువల్లే ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయరు. ఆయన ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు. పుష్కరకాలం కూడా దాటిపోయింది.అయినప్పటికీ మోడీ తన తీరు మార్చుకోలేదు…ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్ గాంధీ నుంచి మొదలుపెడితే మమతా బెనర్జీ వరకు చేసే విమర్శలు ఇవి. నరేంద్ర మోడీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకపోవడానికి ప్రధాన కారణం […]

Narendra Modi : మోడీ విలేకరుల ముందుకు రారు. ధైర్యంగా మాట్లడలేరు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. మోడీ చేసేవి గొప్ప పనులు లేవు. అందువల్లే ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయరు. ఆయన ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు. పుష్కరకాలం కూడా దాటిపోయింది.అయినప్పటికీ మోడీ తన తీరు మార్చుకోలేదు…ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్ గాంధీ నుంచి మొదలుపెడితే మమతా బెనర్జీ వరకు చేసే విమర్శలు ఇవి.

నరేంద్ర మోడీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. కాకపోతే దీనిని నరేంద్ర మోడీ బయట పెట్టలేదు. నరేంద్ర మోడీ ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ దేశంలో అక్కడ విలేకరులు నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. దీనికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్ర టాండన్ క్లారిటీ ఇచ్చారు.

“నరేంద్ర మోడీ గురించి మీకొక విషయం చెప్పాలి. ఆయన సమర్థవంతమైన నాయకుడు. ఆదర్శాన్ని పాటించే నాయకుడు. భారత దేశంలో ఎక్కువ శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు రాజకీయ నేతలతో నేరుగా ఉండే సంబంధాలు మాత్రమే కోరుకుంటారు.. వారికి మధ్యవర్తులు అవసరం లేదు. అటువంటి వారితో సంభాషించడం వారు ఇష్టపడరు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నిక కావడం ఇది మూడవ పర్యాయం. భారత దేశంలో ఎక్కువ కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన వారి జాబితాలో నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉంటారు. అలాంటప్పుడు ఆయన విలేకరులతో ఎందుకు మాట్లాడరు.. ఎందుకు సంభాషించారు అనే ప్రశ్నలకు అర్థం లేదని” టాండన్ వ్యాఖ్యానించారు.

ఆ మధ్య నరేంద్ర మోడీ నార్వేలో పర్యటించారు. అక్కడ ఒక మహిళా జర్నలిస్టు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తుండగా ఆయన వెళ్లిపోయారు. అప్పటికే విలేకరుల సమావేశం ముగిసింది. ఆ విలేఖరి కావాలని ప్రశ్న అడగడం.. సరిగా అదే సమయానికి నరేంద్ర మోడీ వెళ్లిపోవడంతో.. ఇక్కడున్న ఉదార వాదులు..ఇంకా కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు ఆ విషయం మీద పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. చివరికి అసలు విషయం తెలుసుకొని.. సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్లకు నరేంద్ర మోడీ విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించరు అనే అంశం మీద క్లారిటీ రావడంతో.. ఇక ఈ అంశం మీద చర్చ ముగిసిందనే అనుకోవాలని బిజెపి నేతలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper