Trump ceasefire : కొద్దిరోజులుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ దారుణంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతి దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. యుద్ధం వల్ల అటు ఇజ్రాయిల్.. ఇటు ఇరాన్ ప్రాంతాలలో విపరీతమైన విధ్వంసం చోటుచేసుకుంది.
ఇరాన్ సుప్రీం లీడర్ తో పాటు.. కీలకమైన నాయకులను కోల్పోయింది. ప్రజల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి. ఇరాన్ చమురు వ్యాపారం మీద అతిపెద్ద దెబ్బ పడింది. ఆ దేశంలో ఉన్న రిఫైనరీలలో కొన్ని ధ్వంసమయ్యాయి. అక్కడ పరిపాలన మొత్తం నాశనమైంది. ఇరాన్ దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు. ఇంత స్థాయిలో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా ఇజ్రాయిల్ మీద భీకరంగా దాడులు చేస్తోంది.
అమెరికా ఆయుధ సంపత్తి పై కూడా ఇరాన్ దాడులు చేయడం.. హర్ముజు జలసందిలో సరుకు రవాణాపై ఆంక్షలు విధించడం.. ఇలా రకరకాల పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగి వచ్చారు. స్వదేశంలో కూడా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో ఆగ్రహా వేశాలు వ్యక్తమవుతున్న క్రమంలో.. అమెరికా అధ్యక్షుడు దిగిరాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఐదు రోజులపాటు సీజ్ ఫైర్.. కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పవర్ ప్లాంట్.. ఎనర్జీ ఇన్ఫ్రా మీద మిలిటరీ స్ట్రైక్స్ వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. గడిచిన రెండు రోజులుగా అటు ఇరాన్.. ఇటు అమెరికా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చర్చలు ఫలప్రధమయ్యాయి అని.. అందువల్లే కాల్పుల విరమణ చేపడుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
అయితే ట్రంప్ మాటలను మెజారిటీ ప్రజలు నమ్మడం లేదు. యుద్ధం చేసే స్థాయి అమెరికాకు తగ్గిపోయింది కాబట్టి.. అందువల్లే ఇరాన్ దేశంతో చర్చలు జరిపి ఉంటారని.. ఫలితంగానే ఈ ప్రకటన చేసి ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ట్రంప్ వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు భారీగా వ్యక్తం అయ్యాయి. ఇంటెలిజెన్స్ కూడా ట్రంప్ కు కీలకమైన సమాచారం అందించడంతో యుద్ధం ముగింపు గురించి కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.