Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం ఎలాంటిదైనా మననంలో ఉండదు. ఎలాగైనా కొడతాడు. ఎటువైపైనా కొడతాడు. అతడికి కావలసింది పరుగులు. సిక్సర్లు.. ఫోర్లు.. ఇలా చేస్తుండగానే విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు.. అందువల్లే అతడిని టీమిండియా రన్ మాస్టర్ అని పిలుస్తుంటారు. ఐపీఎల్ లో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. అయితే ఇటీవలి ఐర్లాండ్.. […]

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం ఎలాంటిదైనా మననంలో ఉండదు. ఎలాగైనా కొడతాడు. ఎటువైపైనా కొడతాడు. అతడికి కావలసింది పరుగులు. సిక్సర్లు.. ఫోర్లు.. ఇలా చేస్తుండగానే విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు.. అందువల్లే అతడిని టీమిండియా రన్ మాస్టర్ అని పిలుస్తుంటారు. ఐపీఎల్ లో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. అయితే ఇటీవలి ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్లలో తన స్థాయికి మించి ఆడలేదు. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్ ద్వారా అతడు అదరగొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

అభిషేక్ శర్మ జింబాబ్వే సిరీస్ లో టీమిండియా కు ఓపెనర్ గా ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో అరుదైన రికార్డు అతడిని ఊరిస్తోంది. ఆ ఘనత అతడికి 16 పరుగుల దూరంలో ఉంది. ఒకవేళ గనుక అతడు ఆ పరుగులు చేస్తే ఈ రికార్డు సాధించిన భారత జట్టు తరఫున నాలుగవ ఆటగాడిగా నిలుస్తాడు. టి20 లలో 6000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించిన నాలుగవ భారత ఆటగాడిగా నిలుస్తాడు.

అభిషేక్ శర్మ కంటే ముందు కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ..గిల్ మాత్రమే ఈ జాబితాలో ముందున్నారు. అభిషేక్ శర్మ ఇప్పటివరకు 203 మ్యాచ్లలో 199 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో 53 మ్యాచులలో భారత జట్టు తరఫున రంగంలోకి దిగాడు. ఇతడి ఖాతాలో 5984 పరుగులు ఉన్నాయి. కేఎల్ రాహుల్ భారత గట్టి తరఫున కేవలం 166 ఇన్నింగ్స్ లలోనే ఏ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 184.. గిల్ 185 ఇన్నింగ్స్ లో ఈ పరుగులు సాధించారు.

మొత్తంగా 6000 మార్కు పరుగులను వేగంగా అందుకున్న బ్యాటరుగా గేల్ రికార్డు సృష్టించాడు. ఇతడు కేవలం 162 ఇన్నింగ్స్ లలోనే ఈ రికార్డు అందుకోవడం గమనార్హం. అభిషేక్ శర్మ ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్లో గనుక అదరగొడితే కచ్చితంగా సరికొత్త రికార్డు సృష్టించేవాడు. కానీ ఇంగ్లాండ్ గడ్డమీద అభిషేక్ విఫలమయ్యాడు. ఐర్లాండ్ జట్టు మీద కూడా తన స్థాయి ఆట తీరు కొనసాగించలేకపోయాడు.

అభిషేక్ శర్మ జింబాబ్వే సిరీస్ ద్వారా టచ్ లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. అతడు ఐపిఎల్ స్థాయిలో రెచ్చిపోవాలని.. మైదానంలో పరుగుల వరద పారించాలని.. వరుసగా ఎదురైన రెండు సిరీస్ ఓటములకు ఫుల్స్టాప్ పెట్టాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. జింబాబ్వే సిరీస్ ద్వారా అభిషేక్ శర్మ టచ్లోకి వస్తే టీమ్ ఇండియాకు పెద్ద రిలీఫ్ అవుతుంది. ఇదే సమయంలో వైభవ్ సూర్య వంశీ కూడా ఫామ్ అందిపుచ్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఈ సిరీస్ ఎలాగైనా గెలవాల్సిన అవసరం టీమిండియా కి ఉంది. ఎందుకంటే వరుసగా రెండు సిరీస్ లు కోల్పోవడంతో టీమ్ ఇండియా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడిని అయ్యర్ ఎలా అధిగమిస్తాడో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper