Homeఎడ్యుకేషన్SBI Foundation Scholarship: 15 వేల నుంచి 15 లక్షల వరకు.. ఎస్బీఐ ఇస్తున్న ఈ...

SBI Foundation Scholarship: 15 వేల నుంచి 15 లక్షల వరకు.. ఎస్బీఐ ఇస్తున్న ఈ నజరానా గురించి తెలుసా

SBI Foundation Scholarship: నేటి కాలంలో చదువే వెలకట్టలేని ఆస్తి. చదువుకుంటే చాలు ఎక్కడైనా బతుకొచ్చు. ఎలాగైనా బతుకొచ్చు. నేటి ఆధునిక కాలంలో చదువు అనేది ఖచ్చితమైన అవసరంలాగా మారింది. విద్య మీద ప్రభుత్వం భారీగానే ఖర్చు పెడుతున్నప్పటికీ.. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాలలో చదువుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లిదండ్రులు తమ శక్తికి మించిన స్థాయి అయినప్పటికీ.. తమ పిల్లలను ప్రయాసకు ఓర్చి చదివిస్తున్నారు. వాస్తవానికి చదువు అనేది కచ్చితంగా ఉండాలి. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి […]

SBI Foundation Scholarship: నేటి కాలంలో చదువే వెలకట్టలేని ఆస్తి. చదువుకుంటే చాలు ఎక్కడైనా బతుకొచ్చు. ఎలాగైనా బతుకొచ్చు. నేటి ఆధునిక కాలంలో చదువు అనేది ఖచ్చితమైన అవసరంలాగా మారింది.

విద్య మీద ప్రభుత్వం భారీగానే ఖర్చు పెడుతున్నప్పటికీ.. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాలలో చదువుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లిదండ్రులు తమ శక్తికి మించిన స్థాయి అయినప్పటికీ.. తమ పిల్లలను ప్రయాసకు ఓర్చి చదివిస్తున్నారు. వాస్తవానికి చదువు అనేది కచ్చితంగా ఉండాలి. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలి.

విద్యాలయాలలో చదివే అందరు విద్యార్థులు గొప్పగా రాణించలేరు. రాణించే విద్యార్థులకు ఆర్థిక స్తోమత అంతగా ఉండదు. అటువంటి విద్యార్థుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్లాటినం జూబ్లీ ఆశ స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ల ద్వారా పేద విద్యార్థులకు ఎస్బిఐ అండగా నిలుస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్.. యూజీ.. పీజీ.. మెడికల్.. ఐఐటి.. ఐఐఎం.. ఓవర్సీ స్ లో చదివే విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం అప్లై చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి 15 వేల నుంచి 15 లక్షల వరకు ఎస్బిఐ సాయం చేస్తూ ఉంది. గడచిన విద్యా సంవత్సరంలో 75% మార్పులు.. వార్షిక ఆదాయం మూడు నుంచి 6 లక్షల లోపు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాల కోసం exhttps://www.sbiasischolarship.co.in/ లో సంప్రదించవచ్చు.

పేద విద్యార్థులు చదువును ఆపివేయకూడదని.. ఉన్నత చదువులు చదవాలని.. వారు ఉన్నతంగా ఎదగాలని ఎస్బిఐ ఒక సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉపకార వేతనాలు అందించడం ద్వారా విద్యార్థులు సక్రమంగా చదువుకుంటారని.. వారు ఉన్నతంగా ఎదుగుతారని ఎస్బిఐ భావిస్తోంది. కేవలం ఉపకార వేతనాలు మాత్రమే కాకుండా.. విద్యా రుణాలు కూడా ఎస్బిఐ అందిస్తుంది. విద్యార్థులు చదువుకొని ప్రయోజకులుగా ఎదగాలని ఎస్బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో చదువును ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంతో మంది ఆడపిల్లలు లబ్ధి పొందారు. వారంత కూడా ఉన్నత చదువులు చదివారు. ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నారు. అటువంటి ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించామని.. ఆడపిల్లల్లో చదువు ఆవశ్యకతను పెంచడానికి ఈ పథకం తోడ్పడుతుందని ఎస్బిఐ భావిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper