Homeఎంటర్టైన్మెంట్SKN leaked audio : లీకైన SKN ఆడియో రికార్డు.. 'రాజాసాబ్' ఫలితంతో నాకు ఎలాంటి...

SKN leaked audio : లీకైన SKN ఆడియో రికార్డు.. ‘రాజాసాబ్’ ఫలితంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కామెంట్స్..

SKN leaked audio : సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు SKN . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ కి పీఆర్వో గా పనిచేసేవారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి పీఆర్వోగా చాలా ఏళ్ళు పనిచేసి మంచి ఫేమ్ ని సంపాదించారు. అలా అంచలంచలుగా ఎదుగుతూ ‘టాక్సీ వాలా’ చిత్రం తో నిర్మాతగా మారే రేంజ్ కి వచ్చారు. తొలిసినిమానే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన […]

SKN leaked audio : సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు SKN . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ కి పీఆర్వో గా పనిచేసేవారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి పీఆర్వోగా చాలా ఏళ్ళు పనిచేసి మంచి ఫేమ్ ని సంపాదించారు. అలా అంచలంచలుగా ఎదుగుతూ ‘టాక్సీ వాలా’ చిత్రం తో నిర్మాతగా మారే రేంజ్ కి వచ్చారు. తొలిసినిమానే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘బేబీ’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అయితే కొన్ని పెద్ద సినిమాలకు ఆయన అప్పుడప్పుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటారు. అలా ఆయన పని చేసిన చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

ఈ సినిమా విడుదలకు ముందు SKN చేసిన హంగామా మామూలుది కాదు. సంక్రాంతికి పోటీ లో ఉన్నది , ఇంత కాలం తనకు ఉపాధి కల్పించిన మెగాస్టార్ చిరంజీవి అనేది కూడా మర్చిపోయి ‘సంక్రాంతి పోటీ లో ఉంటున్నది డైనోసార్ అమ్మా.. కాస్త జాగ్రత్త’, ‘పండగ పండగ రెబల్ పండగ’ వంటి మాటలు మాట్లాడారు SKN. అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ కూడా యాంటీ ఫ్యాన్స్ ఈ మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో తిప్పుతూ SKN వెక్కిరిస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే SKN కి మారుతీ మొదటి నుండి మంచి స్నేహితుడు కూడా. ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతీ ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంటే , ఆయన వెనుక నిల్చొని SKN కూడా కంటతడి పెట్టుకున్నారు.

వీటిని చూసి వీళ్లిద్దరి మధ్య ఎంతటి ఎమోషనల్ బాండ్ ఉందో అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు అప్పట్లో. అయితే ఇదంతా డ్రామా యేనా అని అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా సోషల్ మీడియా లో లీకైన SKN కి సంబంధించిన ఆడియో వింటే ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రాక తప్పదు. ఆ ఆడియో లో ఆయన మాట్లాడుతూ ‘రాజా సాబ్ ఫలితం తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను అడుగుతారేంటి?, మీరు అడగాల్సింది హీరో , డైరెక్టర్ లేదా నిర్మాతని కదా’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆడియో విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ SKN పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీకు సంబంధం లేదని ఎలా చెప్తావు , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఊరికే సరదాగా వేయించుకున్నావా మూవీ టైటిల్స్ లో అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అయినటువంటి ఆ ఆడియో ని మీరు కూడా వినేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper