Peddi movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంమని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు కర్ణాటక రాష్ట్రంలో ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ ఈవెంట్ కి విచ్చేసి , పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి, ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం.
ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ ఒక మంచి నటుడు కంటే ముందుగా ఒక గొప్ప మనిషి. తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి ఎన్నో మంచి లక్షణాలు అలవాటు చేసుకున్నాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఒక వీడియో ని నేను కూడా చూశాను , ఆ వీడియో లో రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చుంటారు, రామ్ చరణ్ పైకి లేచి స్టేజి మీదకు వెళ్లబోతుంటే , పవన్ కళ్యాణ్ ఆపి, సెక్యూరిటీ ఏర్పాటు చేసి పంపిస్తాడు , ఆ వీడియో చూసినప్పుడు నా మనసుకి ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమాభినామాలు చూస్తే నాకు నా తమ్ముడు పునీత్ తో ఉన్నటువంటి అనుబంధం గుర్తుకువచ్చింది’ అంటూ శివరాజ్ కుమార్ మాట్లాడిన మాటలు అభిమానులకు చాలా ఎమోషనల్ అనిపించాయి. ఇక పెద్ది గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో రామ్ చరణ్ నటన నిజంగా అద్భుతం, కచ్చితంగా అతనికి నేషనల్ అవార్డు వస్తుందని బలంగా నమ్ముతున్నాను. దాదాపుగా రెండేళ్ల పాటు చరణ్ ఈ సినిమా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాడు. చాలా నిజాయితీగా అతను ఈ పాత్రలోకి ఒదిగిపోయాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఒక బలమైన కథకి , ఎమోషనల్ జర్నీ తోడైతే ఎలా ఉంటుందో , అదే పెద్ది లో మనం చూడబోతున్నాం. బుచ్చి అద్భుతంగా ఈ సినిమాని తీర్చి దిద్దాడు. ముఖ్యంగా ఈ చిత్రం లోని ప్రతీ క్యారెక్టర్ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇక రత్నవేలు గారి విజువల్స్ ఆడియన్స్ ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి చిరకాలం గుర్తుండిపోతుంది. సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మేమంతా ఒక కుటుంబం లాగానే కలిసున్నాం’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
