సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై త్రుటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4 గంటలకు వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా హైదరాబాద్ కు బయలుదేరింది. ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే రాజీవ్ రహదారినుంచి జగదేవపూర్ వైపు మళ్లీస్తున్న కంటైనర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Rtc bus collides with container 20 injured
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com