Women beat RTC Bus Conductor: సూపర్ సిక్స్( super six ) పథకాలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు కూడా సిద్ధపడుతోంది. మరోవైపు ఆడబిడ్డల నిధికి సైతం వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేసింది. అన్న క్యాంటీన్లను తెరిచింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ వస్తోంది. అయితే మరో కీలకమైన పథకానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇందుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించింది. స్వాతంత్ర దినోత్సవం నాడు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించింది. అధికారులు సైతం కసరత్తు ప్రారంభించారు.
Also Read: Aadabidda Nidhi Scheme for Women: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఇకనుంచి ఏడాదికి రూ.18 వేలు!
తరచూ గొడవలే..
మరోవైపు తెలంగాణలో( Telangana) ఈ పథకం ఇప్పటికే అమలవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఎక్కువ కావడం, బస్సులు తక్కువగా ఉండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఒక బస్సు కండక్టర్ను మహిళలు దాడి చేయడం వైరల్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో అన్ని సీట్లు మహిళలతో నిండిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడే గొడవలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Ponguleti Srinivas Reddy: కేటీఆర్ పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్
హైదరాబాదులో ఘటన?
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలు డ్రైవర్ తో పాటు కండక్టర్ను మహిళలు కొడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అది తెలంగాణలో( Telangana) అని తెలుస్తోంది. హైదరాబాదులోని ఓ డిపో వద్దని సమాచారం. ముఖ్యంగా భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ అవుతుండడంతో కొన్ని స్టాపుల వద్ద ఆర్టీసీ బస్సులు నెలపడం లేదన్న విమర్శ ఉంది. అటువంటి ఘటనే హైదరాబాదులో జరగడంతో మహిళా ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిపై తిరగబడినట్లు తెలుస్తోంది. బస్సు కిందకు దిగి మహిళలు వాదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదనలు కూడా సాగాయి. అనంతరం అక్కడే ఉన్న కండక్టర్ ను మహిళలు శతక బాధడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది కానీ.. అది ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. కానీ ఇదే అదునుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పునరాలోచించుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిని ట్రోల్ చేస్తున్నారు.
ఫ్రీ బస్సు ఇవ్వలేదు అని కండక్టర్ ని చితకబాదిన వీర మహిళలు … ఆలోచనలో పడ్డ @ncbn @PawanKalyan pic.twitter.com/7p9dGkVVN1
— Guerrilla Warfare (Chatrapathi Shivaji Army) (@ADDICTEDTOAMMA) June 15, 2025