RTC Bus Women Fighting: ఇంతలోనే బస్సు పక్కన సీట్లో ఓ వ్యక్తి కూర్చున్నాడు. ఆ సీటు పక్కన కాస్త స్పేస్ ఉంది. ఇంతలోనే అక్కడ కూర్చోవడానికి ఓ మహిళ వచ్చింది. దానికి ఆ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక అక్కడ గొడవ మొదలైంది.. కాస్త పక్కన జరిగితే నేను కూర్చుంటానని ఆ మహిళ అన్నది.” బస్సుల మొత్తం మీరే ఉన్నరు. ఫ్రీ గనే కదా పోయేది. ఆ మాత్రం దానికి కాస్త నిలబడలేర. కొద్దిగా ఓర్సుకుంటే సరిపోతది కదా.. ఇప్పుడు నేను పక్క జరిగితే అప్పుడు మొత్తం మీరే ఉంటరు. అప్పుడు నేనేం చేయాలె. ఇదంతా ఎందుకు. మీరు పక్కన కూకుంటే నేను సరిగా ఉండలేను” అని ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. అది ఆమెలో కోపాన్ని కలిగించింది. ఇంకేముంది ఆ మహిళ కొన్ని మాటలు వదిలిపెట్టింది. అది కాస్త ఆ వ్యక్తికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇద్దరి మధ్య మాటలు దొర్లాయి.
అతడు లేచి ఆమెతో వాదన పెట్టుకుంటుంటే.. మరో మహిళ వచ్చి ఆ ప్లేస్ లో కూర్చుంది. దీంతో అతడు ఆమె తో వాదించడాన్ని పక్కనపెట్టి.. ఈమెను లేవమని అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ఇక తర్వాత బస్సులో రచ్చ రచ్చ జరిగింది.. కండక్టర్ చెబుతున్నప్పటికీ వారెవరూ వినిపించుకోలేదు. డ్రైవర్ హెచ్చరిస్తున్నప్పటికీ ఎవరి గొడవలో వారు మునిగిపోయారు. ఇక కొంతమంది ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాకి ఎక్కించారు. అది కాస్త నెట్టింటపడి రచ్చ రచ్చ అవుతుంది.. వాస్తవానికి ఆ బస్సులో ఉన్నది ఒకటే సీటు. ఆ వ్యక్తి కూర్చున్నప్పుడు.. కాస్త ఓర్చుకుంటే సరిపోయేది. కానీ ఆ కాస్త స్పేస్ లో కూర్చోవడానికి ఒక మహిళ పోటీ పడటం.. ఆమె ఆ వ్యక్తితో వాగ్వాదానికి దిగడం.. మరో మహిళ ఈ వివాదంలోకి రంగ ప్రవేశం చేయడం సంచలనం కలిగించింది.. అంతే కాదు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు కూడా.
ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులలో ఈ తరహా గొడవలు పెరిగిపోతున్నాయి. సీటు కోసం ప్రయాణికులు కొట్టుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. ఇటీవల మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఓ బస్సులో కూడా ఈ తరహాలో గొడవ జరిగింది. ఇద్దరు మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. చివరికి డ్రైవర్ బస్సు ఆపి హెచ్చరించడంతో ఆ గొడవ కాస్త ఆగిపోయింది. పరిగి నుంచి వికారాబాద్ వెళుతున్న బస్సులో కూడా ఇదే తరహాలో గొడవ జరిగింది. కాకపోతే ఓ వ్యక్తి, ఇద్దరు మహిళల మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ చెప్పినా, కండక్టర్ పదే పదే మొత్తుకున్నా వారెవరూ తమ గొడవను తగ్గించుకోకపోవడం విశేషం.
View this post on Instagram