TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లే అవకాశం ఉండడంతో మహిళలు పొట్టుపొట్టుగా ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. దర్జాగా ఆయా ప్రాంతాలను తిరిగి వస్తున్నారు.. మండే ఎండాకాలంలో కూడా మహిళలు తగ్గడం లేదు. పైగా ఇతర ప్రాంతాలను చూసి రావడానికి ఇదే అదునుగా ప్రయాణ సాగిస్తున్నారు. ఫలితంగా బస్సులు కిటకిటలాడుతున్నాయి. దసరా, సంక్రాంతి పండుగను తలపించే విధంగా ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉంటున్నాయి. సహజంగానే ఆడోళ్ళు బయటికి ప్రయాణం సాగిస్తే లగేజీ విపరీతంగా ఉంటుంది. పైగా మన తెలంగాణ అమ్మలక్కలకు ఇంట్లో కావలసిన సమాను.. ఇంకా ఇతరత్రాలు కొనుక్కుంటారు. అలాంటప్పుడు లగేజీ కాస్త గట్టిగానే ఉంటది.. ఇప్పుడు ఎట్లాగూ ఫ్రీ ప్రయాణం కాబట్టి.. లకేజీ కూడా బస్సులోనే వేయడం వల్ల.. బస్సులు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలోనే బస్సుల్లో ఖాళీ ఉండడం లేదు.
Also Read: ఎంత ట్రోలింగ్ చేస్తే.. అంత ఆదాయం.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్కూ!
సజ్జనార్ సార్ జర చూడండి..
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక మహిళలు ఫ్రీ ప్రయాణం కావడంతో.. దర్జాగా ఇతర ప్రాంతాలను చూస్తున్నారు. కొందరైతే బస్సుల్లో ప్రయాణించుకుంటూ అల్లం ఎల్లిగడ్డలు పొట్టు తీస్తున్నరు. ఇక కొందరు అమ్మలక్కలైతే అయితే నెత్తులల్ల పేన్లు కూడా చూసుకుంటున్నరు. ఇక ఇదే క్రమంలో ఓ అక్క నల్గొండ పోయేందుకు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కింది. చేతుల ఓ సంచితో సీట్ల కూకున్నది. ఆమె పట్టుకున్న సంచిలో మూడు బాటిళ్లు ఉన్నయి. అందులో నిండుగా కల్లు ఉన్నది. అది మంచి వాసన కొడుతున్నది. ఆమె పక్కన కూకున్న కొంతమంది ఆడోళ్లకు ఆ వాసన నచ్చలేదు. ఇదే ముచ్చటను ఆడ కండక్టర్ కు చెప్పిర్రు. ఆమె ఎమ్మటే ఆ మహిళా ప్రయాణికురాలిని కిందికి దించింది. కల్లు ఇందులో తీసుకుపోతే నడవదు.. చేతుల్లో కల్లు బాటిళ్లు పట్టుకొని.. బస్సులో పోతమంటే కుదరదు అంటూ.. ఆమెకు చెప్పి కిందికి దించింది. అది ఆ మహిళా ప్రయాణికురాలికి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే బస్సును ముందుకు కదలనియకుండా అడ్డంగా నిలబడ్డది.. బస్సులో కల్లు తీసుకుపోకూడదని ఉన్నదా అని రూల్స్ గురించి మాట్లాడింది. అక్క ఫోన్ లో మాట్లాడుకుంటా.. ఎవలకో ఈ ముచ్చట చెప్పుకుంట.. ఆడ కండక్టర్ తో లడాయికి దిగింది.. దీని కొంతమంది ఫోన్లలో రికార్డు చేసి.. సోషల్ మీడియాకు ఎక్కిచ్చిర్రు.. ఇంకేముంది దెబ్బకు సెన్సేషనల్ అయ్యింది. ఇంకా కొంతమంది నెటిజన్లు అయితే.. ఏకంగా సజ్జనార్ సార్ ట్వీట్ కొట్టిర్రు..సార్ ఉచితంగా ప్రయాణం చేపించే సౌలత్ కల్పించిర్రు.. జర ఈ అక్కకు కల్లు తీసుకుపోయే అవకాశం ఉంటే చూడరాదురి అంటూ రిక్వెస్ట్ చేసిర్రు.. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం.. కలు పంచాయితీ దాకా వెళ్ళింది ..