Telangana : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మణుగూరులో ఆర్టీసీ బస్సు భద్రాచలం బయలుదేరింది. మండే ఎండాకాలమైనప్పటికీ ప్రయాణికులతో ఆ బస్సు కిక్కిరిసిపోయి ఉంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పించిన నేపథ్యంలో.. మహిళలు కూడా ఆ బస్సులో భారీగానే ఎక్కారు. ఒకరకంగా మణుగూరులోనే ఆ బస్సు ఫుల్ ప్యాక్ అయింది. దీంతో ఒక మహిళ ముందుగానే సీటు లో చున్నివేసింది. ఆమె చున్ని వేయడానికంటే ముందే బస్సు ఎక్కిన ఓ మహిళ ఆ సీట్లో కూర్చుంది. దీంతో చున్ని వేసిన మహిళ బస్సు ఎక్కిన తర్వాత ఆగ్రహానికి గురైంది. “నేను చున్ని వేశాను.. మర్యాదగా ఈ సీట్లో నుంచి లేవండి. నేను కూర్చోవాలి” అని ఆ మహిళ అన్నది. “ఈ సీటు మీ ఒక్కరి కోసమే రిసర్వ్ చేసి లేదు. ఇది ఎక్స్ ప్రెస్ బస్సు. మీరు చున్ని వేసినంతమాత్రాన సీటు ఇది ఎలా అవుతుంది.. నేను లేవను. నేను భద్రాచలం దాకా వెళ్లాలి. నేను మీకు సీటు ఇవ్వను” అని మరో మహిళ సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరు మహిళలు సహనాన్ని కోల్పోయి బూతులు తిట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.
Also Read : గడియారం కథ మీకు తెలుసా? ఎప్పుడు పుట్టింది? ముందు పెట్టుకుంది ఎవరు? తయారు చేసింది ఎవరు?
సీటు కోసం లొల్లి
ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టు కుంటున్న నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. బస్సు కండక్టర్ ఎంత చెప్పినప్పటికీ ఆ ఇద్దరు మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తోటి ప్రయాణికులు వారిస్తున్నప్పటికీ.. వారు అంతకుమించి అనే రేంజ్ లో కొట్టుకున్నారు. పైగా నీ అంత చూస్తా అని ఒక మహిళ బెదిరిస్తే… అప్పటిదాకా ఎందుకు ఇక్కడే చూసేయని మరొక మహిళా సవాల్ విసిరింది. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య వారి ప్రయాణం సాగింది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఓ ప్రయాణికుడు తన చరవాణిలో వీడియో రికార్డ్ చేశాడు. దానిని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అయితే బస్సులో సీటు విషయంలో ఎవరో ఒకరు కాస్త సహనాన్ని ప్రదర్శించి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదని ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పేర్కొన్నారు..” ఇద్దరు మహిళలకు ఓపిక లేదు. ఏ మాత్రం సహనాన్ని ప్రదర్శించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వారు మాత్రమే కాదు.. మాకు కూడా ఇబ్బంది కలిగించారు. ప్రభుత్వం కల్పించిన ఫ్రీ సర్వీస్ ను ఉపయోగించుకోవడంలోనూ ఓపిక లేక పోతే ఎలా అంటూ” తోటి ప్రయాణికులు వాపోతున్నారు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
నీ అంతు చూస్తా బిడ్డా అంటూ..
మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు pic.twitter.com/qa6c2v9UJK— Telugu Scribe (@TeluguScribe) May 15, 2025