Homeటాప్ స్టోరీస్CM Revanth Reddy: మీ సార్ అంత ఇంగ్లీష్ నాకు రాదు..టీ న్యూస్ రిపోర్టర్...

CM Revanth Reddy: మీ సార్ అంత ఇంగ్లీష్ నాకు రాదు..టీ న్యూస్ రిపోర్టర్ ను ఓ ఆట ఆడుకున్న రేవంత్.. వైరల్ వీడియో

CM Revanth Reddy: రాజకీయ నాయకులు సీరియస్ గా మాట్లాడుతుంటే జనాలకు అంతగా చూడబుద్ధి కాదు. సీరియస్గా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు టంగ్ స్లిప్ అవుతుంటారు. ఆ సమయంలో బూతులు వచ్చేస్తుంటాయి. పేగుల మెడలో వేసుకుంటా.. తొక్కుకుంట పోతా.. హౌలా.. ఇలాంటి బూతులు చాలానే వస్తుంటాయి. చిన్నపిల్లలు చూసేందుకు ఇటువంటి వాటిని ఇష్టపడరు. అలాగని పెద్దలు కూడా అంతగా ఆసక్తి చూపించరు. రాజకీయ నాయకులు ఇలాంటి బూతులు కాకుండా సమయానికి తగ్గట్టుగా పంచులు వేసుకుంటూ.. లౌక్యంతో మాట్లాడితే […]

CM Revanth Reddy: రాజకీయ నాయకులు సీరియస్ గా మాట్లాడుతుంటే జనాలకు అంతగా చూడబుద్ధి కాదు. సీరియస్గా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు టంగ్ స్లిప్ అవుతుంటారు. ఆ సమయంలో బూతులు వచ్చేస్తుంటాయి. పేగుల మెడలో వేసుకుంటా.. తొక్కుకుంట పోతా.. హౌలా.. ఇలాంటి బూతులు చాలానే వస్తుంటాయి. చిన్నపిల్లలు చూసేందుకు ఇటువంటి వాటిని ఇష్టపడరు. అలాగని పెద్దలు కూడా అంతగా ఆసక్తి చూపించరు.

రాజకీయ నాయకులు ఇలాంటి బూతులు కాకుండా సమయానికి తగ్గట్టుగా పంచులు వేసుకుంటూ.. లౌక్యంతో మాట్లాడితే చూడడానికి చాలా బాగుంటుంది. వినడానికి అంతకంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది రాజకీయ నాయకులు సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. ఆవేశంలో వారు మాట్లాడే బూతులను పక్కన పెడితే.. లౌక్యంగా మాట్లాడే మాటలు.. సమయానికి తగ్గట్టుగా వేసే పంచులు చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలానే మాట్లాడుతుంటారు. ఆయన ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాంటి మాటలే ఇటీవల రేవంత్ మాట్లాడారు.

కెసిఆర్ అంటే చాలు రేవంత్ మండిపడుతుంటారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో లైన్ తప్పి మాట్లాడుతుంటారు. ఇలాంటి రాజకీయాలు అవసరమా.. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు.. వీటిని ఒకసారి రేవంత్ ప్రశ్నించుకోవాలి. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కూడా ఇది వర్తిస్తుంది..ఇటీవల ఓ సమావేశంలో రేవంత్ మాట్లాడారు . అక్కడ టీ న్యూస్ విలేకరి నరేంద్ర మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. అదే సమయంలో ఆయనను బడే బాయ్ అని ప్రస్తావించారు.

దానికి రేవంత్ తనదైన శైలిలో స్పందించారు.. ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని.. ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బడే బాయ్ అని.. ముఖ్యమంత్రిలు చోటాబాయ్ అని.. అందులో తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు. “నువ్వు కనపడితే పలకరిస్తా సూరజ్. నువ్వు టీ న్యూస్ లో పనిచేస్తున్నామని నీ ముఖంలో కేసీఆర్ ను చూడను కదా. నీలో ఉన్న జర్నలిస్టును మాత్రమే చూస్తాను. మీ సార్ లాగా నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. బడే బాయ్ ని ఇంగ్లీష్ లో బిగ్ బ్రదర్ అని పిలుస్తుంటారని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. అయితే ఈ వీడియో ఇటీవల బయటికి వచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

 

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper