Sonia Gandhi Autobiography : సోనియాగాంధీ తన ఆత్మకథను రాసుకుంది. మొదట్లో తన వ్యక్తిగత జీవితం.. రాజీవ్ తో ప్రేమ వ్యవహారం.. ఇందిరగాంధీ ఇంట్లోకి ప్రవేశం వరకూ వివాదం కాదు.. అక్కడ నుంచి రాజకీయంగా మారింది. ఆ తర్వాత చాలా వివాదాస్పద అంశాలున్నాయి. సోనియా, మేనక గాంధీల మధ్య విభేదాల గురించి రాసుకొచ్చారు. రాజకీయ వ్యాఖ్యానాలు చేసినప్పుడు అన్నింటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే.. వ్యక్తిగతంగా సోనియా రాజకీయాల్లో వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పారా? 1967లో వివాహం చేసుకొని 1983 వరకూ ఎందుకు పౌరసత్వం తీసుకోలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం లేదు.
1983లో పౌరసత్వం వస్తే 1980లోనే ఎలా ఓటు వేశారని సోనియాను ప్రశ్నిస్తున్నారు. భోపాల్ గ్యాస్ వేలాది మంది మరణాలకు కారకుడైన కాట్రోజీని దేశం నుంచి బయటకు పంపిన దాంట్లో సోనియాగాంధీ పాత్ర ఎంతో ఉందని విమర్శించారు. దీనిపై ఒక్క వివరణ ఇవ్వలేదు సోనియాగాంధీ.
పీవీ నరసింహరావు చనిపోయాక కాంగ్రెస్ కార్యాలయంలోకి ఆయన శవాన్ని కూడా తీసుకురానివ్వకపోవడానికి సోనియా కారణమని విమర్శలున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వలేదు..
చైనీస్ తో ఒక సీక్రెట్ ఎంవోయూపై సంతకం చేశారని ఫొటోలు వచ్చాయి. దీనికి సోనియా ఎందుకు వివరణ ఇవ్వలేదు. కానీ చరిత్రను వక్రీకరించారు.
సోనియా గాంధీ ఆత్మకథలో నిజాయితీ లోపించిందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి.