జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ను భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ పరామర్శించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రేపు ఆయన డిశ్చార్జ్ అవుతారని రాజాసింగ్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించేందుకు ఈటల సిద్ధమవుతున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఆయన ఏడోసారి మళ్లీ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.