
పెగాసస్ వ్యవహారంపై ఈనెల 5న సుప్రీంకోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంతి ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.