Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan : హాలీవుడ్ లో రీమేక్ అయిన 'పంజా' మూవీ.. ఎన్ని వందల కోట్లు...

Pawan Kalyan : హాలీవుడ్ లో రీమేక్ అయిన ‘పంజా’ మూవీ.. ఎన్ని వందల కోట్లు రాబట్టిందో చూస్తే ఆశ్చర్యపోతారు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘పంజా’. ఆ రోజుల్లో ఈ సినిమా పై ఉన్న క్రేజ్ మామూలుది కాదు. నేటి తరం ఆడియన్స్ ‘ఓజీ’ హైప్ కి ఎంత మెంటలెక్కిపోయారో , ఆరోజుల్లో ‘పంజా’ హైప్ విడుదలకు ముందు ఆడియన్స్ అదే రేంజ్ లో పిచ్చెక్కిపోయేలా చేసింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే అప్పట్లో ఒక సెన్సేషన్. టీజర్ ట్రైలర్ వంటివి కూడా బాగా […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘పంజా’. ఆ రోజుల్లో ఈ సినిమా పై ఉన్న క్రేజ్ మామూలుది కాదు. నేటి తరం ఆడియన్స్ ‘ఓజీ’ హైప్ కి ఎంత మెంటలెక్కిపోయారో , ఆరోజుల్లో ‘పంజా’ హైప్ విడుదలకు ముందు ఆడియన్స్ అదే రేంజ్ లో పిచ్చెక్కిపోయేలా చేసింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే అప్పట్లో ఒక సెన్సేషన్. టీజర్ ట్రైలర్ వంటివి కూడా బాగా పేలాయి. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తారు అనే రేంజ్ హైప్ తోనే విడుదలైంది. ఫస్ట్ హాఫ్ వరకు అంచనాలను అందుకోగలిగింది కానీ , సెకండ్ హాఫ్ మాత్రం దారుణంగా దెబ్బకొట్టింది. దీంతో సినిమా భారీ డిజాస్టర్ గా నిల్చింది , ఆరోజుల్లో కేవలం 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం.

అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ , నేటి జనరేషన్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటన ,స్టైల్ , యాటిట్యూడ్ , మ్యానరిజమ్స్ జెన్ జీ ఆడియన్స్ కి నచ్చింది. ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఓజీ సినిమా కంటే ఎక్కువగా పంజా సినిమానే నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన ఎడిటింగ్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి . పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో మరోసారి రీ రిలీజ్ కాబోతుంది. ఈ రీ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఆధారంగా తీసుకొనే హాలీవుడ్ లో పాపులర్ యాక్షన్ సిరీస్ ‘జాన్ విక్’ ని తెరకెక్కించారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో సాగుతోంది.

ఈ సినిమా లో కూడా విలన్ కొడుకు తానూ ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కని చంపేస్తాడు. అక్కడి నుండి మొదలు అవ్వుద్ది యుద్ధం. పంజా లో సెకండ్ హీరోయిన్ ని విలన్ కొడుకు అడివి శేష్ చంపిన దగ్గర నుండి మొదలు అవ్వుద్ది అసలు సిసలు యుద్ధం. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన విజువల్ స్టైల్ , కలర్ గ్రేడింగ్ కూడా పంజా తరహా లోనే ఉండడం గమనార్హం. పంజా 2011 వ సంవత్సరం లో విడుదలైతే , జాన్ విక్ సిరీస్ నుండి మొదటి చిత్రం 2014 లో విడుదలైంది. అందుకే పంజా సినిమాని ఆధారంగా తీసుకొనే జాన్ విక్ మూవీ ని తెరకెక్కించారు అనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. హాలీవుడ్ లో జాన్ విక్ సిరీస్ ఎన్ని వందల కోట్ల గ్రాస్ ని రాబట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది పంజా ని ఆదర్శంగా తీసుకొని రూపొందించారా ?అనే అంశాన్ని పక్కన పెడితే ఆ రోజుల్లోనే ఈ ఇంతటి హై స్టాండర్డ్స్ తో మన టాలీవుడ్ లో ఒక యాక్షన్ మూవీ రావడం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper