Homeఎంటర్టైన్మెంట్Nagabandham Movie: నాగబంధం సినిమాకి నష్టం తప్పదా..? దీనికంతటికీ కారణం ఎవరు..?

Nagabandham Movie: నాగబంధం సినిమాకి నష్టం తప్పదా..? దీనికంతటికీ కారణం ఎవరు..?

Nagabandham Movie: అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటించిన ‘నాగబంధం’ సినిమా ఈనెల మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రోజు నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ కాబట్టి ఈ 3 రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మూడు రోజులు కలిపి ఈ సినిమాకి 11 కోట్ల 50 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి అసలైన పరీక్ష మొదలుకానుంది. సోమవారం […]

Nagabandham Movie: అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటించిన ‘నాగబంధం’ సినిమా ఈనెల మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రోజు నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ కాబట్టి ఈ 3 రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మూడు రోజులు కలిపి ఈ సినిమాకి 11 కోట్ల 50 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి అసలైన పరీక్ష మొదలుకానుంది. సోమవారం నుంచి ఈ సినిమాని ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి షో తోనే ఈ సినిమా డివైడ్ టాక్ ను తెచ్చుకోవడంతో చాలామంది ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.

కొంతమంది విజువల్ గా ఈ సినిమా చాలా గ్రాండీయర్ గా ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాను ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూడడం కంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుందని చెబుతున్నారు.
మరికొంతమంది థియేటర్ కైతే వస్తున్నారు. కానీ కథలో అంత పెద్దగా వైవిధ్యం లేకపోవడం వల్ల ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తుందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా కథలో దమ్మున్నప్పుడే ఏ సినిమా అయినా సక్సెస్ఫుల్గా ఆడుతుంది.

స్టోరీ తేడా కొడితే మాత్రం సినిమాలో ఎన్ని హంగులు ఉన్నా అది ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 100 కోట్లకు పైన బడ్జెట్ తో నిర్మించారు. కాబట్టి ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

అనుకున్న కాన్సెప్ట్ ను పెర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టగలిగే కెపాసిటి ఉన్న మూవీగా మారేది. కానీ దర్శకుడి లోపమా లేదంటే ఇతర సాంకేతిక నిపుణుల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగిందా అనేది తెలియదు గానీ మొత్తానికైతే సినిమా సోల్ ని చెడగొట్టారనే చెప్పాలి… ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper