Homeక్రీడలుMS Dhoni : రోహిత్, కోహ్లీ ఎందుకు ఆడకూడదు? గౌతం గంభీర్ కు షాకిచ్చిన ఎంఎస్...

MS Dhoni : రోహిత్, కోహ్లీ ఎందుకు ఆడకూడదు? గౌతం గంభీర్ కు షాకిచ్చిన ఎంఎస్ ధోని

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. చాలా విషయాలలో అతను నిదానంగా ఉంటాడు. మౌనమునిగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అతని వ్యూహాలను అమలు చేయడంలో ఏమాత్రం తడబాటును ప్రదర్శించడు. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007 టి20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఒకవేళ టీమ్ ఇండియాకు అతను ఇంకా కొద్ది సంవత్సరాలు పాటు సారధిగా కొనసాగితే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కూడా సాధించేది. ధోని ప్రస్తుతం […]

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. చాలా విషయాలలో అతను నిదానంగా ఉంటాడు. మౌనమునిగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అతని వ్యూహాలను అమలు చేయడంలో ఏమాత్రం తడబాటును ప్రదర్శించడు. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007 టి20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఒకవేళ టీమ్ ఇండియాకు అతను ఇంకా కొద్ది సంవత్సరాలు పాటు సారధిగా కొనసాగితే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కూడా సాధించేది.

ధోని ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు దూరం జరిగాడు. కాకపోతే ఐపిఎల్ లో మాత్రం అతడు ఆడుతున్నాడు.. చెన్నై జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ఘనత ధోనికి ఉంది. ధోని అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదు.. అంతకు మించిన సారధి. వ్యూహాలు అమలు చేయడంలో.. వాటిని ఆచరణలో పెట్టడంలో ధోని తర్వాత ఎవరైనా. అందువల్లే క్రికెట్ గతిని ధోనికి ముందు.. ధోనికి తర్వాత అన్నట్టుగా విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు.

ధోని ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. ముఖ్యంగా తోటి ఆటగాళ్ల మీద ఎటువంటి మాటలు కూడా మాట్లాడడు. జట్టు ప్రయోజనాల విషయంలో మాత్రం ధోని అప్పుడప్పుడు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టుకుంటాడు. తాజాగా అలాంటి అవకాశం ధోనికి లభించింది. దీంతో అతడు మరో మాటకు తావు లేకుండా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తద్వారా తన మరో రూపాన్ని అభిమానులకు పరిచయం చేశాడు.

2027 ప్రపంచ కప్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరు కూడా టి20, టెస్ట్ ఫార్మాట్ ల నుంచి తప్పుకున్నారు. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. భీకరమైన ఫామ్ లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని 2027 వరల్డ్ కప్ లో ఆడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మేనేజ్మెంట్ మాత్రం ఇంతవరకు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో విరాట్, రోహిత్ శర్మను 2027 ప్రపంచ కప్ కోసం ఆడించాలని ధోని పేర్కొన్నాడు.

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు.” శారీరక సామర్థ్యం కొన్ని సందర్భాలలో పనిచేయదు. ఆటగాడికి కావాల్సింది కేవలం ఆట మీద మమకారం మాత్రమే. ఆటపై ఎంతటి స్థాయిలో మనసును లగ్నం చేస్తే అంతటి గుర్తింపు లభిస్తుంది. జట్టుకు కూడా ఉపయోగపడుతుంది. విరాట్, రోహిత్ 2027 వరల్డ్ కప్ లో ఎందుకు వాడకూడదు? వయసు అనేది ప్రమాణం కాదు. ఆట సామర్థ్యమే ప్రామాణికం. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు మెరుగైన క్రికెట్ ఆడగలరా? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? కొందరి ఆటగాళ్ల ప్రదర్శనను వారి వయసుతో ముడి పెట్టకూడదు. వారి సామర్థ్యాన్ని మాత్రమే చూడాలి. విరాట్ , రోహిత్ విషయంలో కూడా మేనేజ్మెంట్ ఇదే విధంగా ఆలోచిస్తే బాగుంటుందని” ధోని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ధోని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం కలిగిస్తున్నాయి. ఎన్నడు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయని ధోని.. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు ధోని మాటలతో చాలామంది అభిమానులు ఏకీభవిస్తున్నారు. సరైన అభిప్రాయం చెప్పాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper