Sara Gill relationship : సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాన్ని సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో చాలామంది ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు సారా – గిల్. సారా లెజెండరీ క్రికెటర్ సచిన్ కుమార్తె. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రపంచాన్ని చుట్టి రావడం .. కొత్త కొత్త ప్రాంతాల గురించి అన్వేషించడం.. స్నేహితులతో కలిసి సరదాగా బయటికి వెళ్లడం సారా హాబీలు. అందువల్లే ఆమె నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తనకు సంబంధించిన ఏ విషయమైనా సరే షేర్ చేసుకుంటుంది. అందువల్లే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. సారా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రధానమైనది ఆమె గిల్ తో రిలేషన్ లో ఉండడం..గిల్ టీమిండియా టెస్ట్ జట్టుకు సారథిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో టీమిండియా కు నాయకత్వం వహిస్తున్నాడు.
Also Read: నిప్పులు చెరిగిన బుమ్రా.. వరుసగా 3 వికెట్లు..
అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో గిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను గిల్ మొహమాటం లేకుండా పంచుకున్నాడు. తను ఎవరితో రిలేషన్లో లేనని.. తనపై వస్తున్నవన్నీ పుకార్లు అని గిల్ కొట్టి పారేశాడు. తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని గిల్ స్పష్టం చేశాడు. తనపై అనవసరమైన ప్రచారం చేయకూడదని.. ప్రస్తుతం తాను క్రికెట్ ను మాత్రమే ప్రేమిస్తున్నానని.. తనకు ప్రేమించే తీరిక లేదని.. ఎదుటి వ్యక్తితో గడిపే అవకాశం కూడా లేదని గిల్ స్పష్టం చేశాడు. దీంతో కొద్దిరోజులుగా “సారా – గిల్” చర్చ నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి సారా – గిల్ కు సంబంధించి చర్చ మొదలైంది. అయితే ఈసారి గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించలేదు. మసాలాను దట్టించలేదు. గిల్ చేసిన చేష్టలు ఇందుకు కారణమయ్యాయి.
ఇటీవల ఇంగ్లాండ్ దేశంలో యువరాజ్ క్యాన్సర్ రోగులకు చారిటీ నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సచిన్ కుటుంబంతో హాజరయ్యాడు. సచిన్, ఆయన భార్య అంజలి, కుమార్తె సారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ఈ కార్యక్రమంలో టీం ఇండియా ప్లేయర్లు కూడా పాలుపంచుకున్నారు. వచ్చిన వారందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆటగాళ్లు డిన్నర్ చేస్తుండగా.. వారి పక్కన సచిన్ తన కుటుంబంతో కూర్చున్నాడు. సచిన్ పక్కన కుమార్తె సారా, మరోవైపు భార్య అంజలి కూర్చున్నారు. టీమిండియా కెప్టెన్ గిల్ సారాను చూసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అంజలి అతడిని చూసింది. గిల్ పక్కన ఉన్న రవీంద్ర జడేజా వారి ఈ సన్నివేశం మొత్తాన్ని చూశాడు. ఆ తర్వాత అతడు ఫుడ్ తింటూ గిల్ ను ఆట పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
Also Read: రోహిత్ కు షాక్.. వన్డే జట్టు కెప్టెన్ గా గిల్.. టీమిండియాలో ఏం జరుగుతోంది?
మొదట్లో గిల్ క్రికెట్ ఆడే మ్యాచ్లకు సారా హాజరయ్యేది. సారా, గిల్ రహస్యంగా కలిసినట్టు అప్పట్లో ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ప్రచారం మొదలైంది. అయితే దీనిపై వారిద్దరు నోరు మెదపలేదు. చివరికి గిల్ మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడేమో సారా కోసం గీల్ చూడడం..గిల్ ను జడేజా ఆట పట్టించడం వంటివి చూస్తుంటే వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ప్రచారం మొదలైంది. మరి దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో చూడాలి.
View this post on Instagram