AUS vs SA : ఇంగ్లీష్ గడ్డలోని ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి టీ అంతిమ సమరం మొదలవుతుంది.. ఈ పోరులో కమిన్స్, బవుమా అమీ తుమీ తేల్చుకోబోతున్నారు.. రెండోసారి కూడా తుది పోరుకు అర్హత సాధించడంతో.. కంగారు జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో ఏమాత్రం రాజీ పడకుండా అద్భుతంగా జట్టును రూపొందించింది.. ఈసారి కూడా గత సీజన్లో మాదిరిగా అసాధారణ ప్రదర్శన చేసి టెస్ట్ గద అందుకోవాలని కంగారు జట్టు భావిస్తోంది.. ఇక ఎవరు ఊహించని విధంగా తొలిసారి సఫారీలు తుది పోరుకు అర్హత సాధించారు. తొలిసారి టైటిల్ అందుకోవడానికి వారు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా తమ బృందాలను ప్రకటించాయి.
ఆస్ట్రేలియా జట్టు ఎలా ఉందంటే..
కమిన్స్ బృందంలోని చాలామంది ప్లేయర్లకు గత సీజన్లో జరిగిన తుది పోరులో ఆడిన అనుభవం ఉంది. అందువల్ల వారికి ఒత్తిడిని తట్టుకునే అవకాశం ఉంది. పైగా ఖవాజా జట్టులోకి వచ్చాడు.. లబుషేన్ టచ్ లో ఉన్నాడు. గ్రీన్ కూడా ప్రధాన ఆ విధంగా మారబోతున్నాడు. స్మిత్ నిలకడకు మారుపేరుగా కనిపిస్తున్నాడు. దూకుడుకు అసలైన పర్యాయపదంగా హెడ్ ఉండనే ఉన్నాడు.. ఇక బౌలింగ్లో స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ శిసలైన త్రయంగా కనిపిస్తున్నారు. వీరిని సఫారీలు ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తి కరం. లయన్ కూడా ఉండనే ఉన్నాడు. వీరు నలుగురు కలిసి టెస్టులలో ఏకంగా 1508 వికెట్లు పడగొట్టారు.. కమిన్స్ ఇంకో ఆరు వికెట్లు గనక తన ఖాతాలో వేసుకుంటే.. సుదీర్ఘ ఫార్మాట్లో 300 వికెట్లు సొంతం చేసుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు.
Also Read : బాలయ్య “కంగారు” రివేంజ్.. ట్రోలింగ్ అదిరిపోలా…
ఒత్తిడి ఏ మేరకు చేయిస్తుంది..
సఫారి జట్టులో మార్క్రం, బవుమా కు కంగారు జట్టు బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది.. స్టబ్స్, రికెల్టన్ ఇటీవలి ఐపీఎల్ లో కంగారు బౌలర్లను కాచుకున్నారు. సఫారీల బ్యాటింగ్ భారం మొత్తం ఈ నలుగురే మోయాల్సి ఉంది.. ఎంత అనుభవం ఉన్న పేస్ బౌలర్ రబాడ ఇటీవల డోపింగ్ వివాదంలో ఇరుక్కుపోయిన నేపథ్యంలో.. తుది సమయంలో అతనిపై అందరి దృష్టి నెలకొంది.. ఇదే మైదానంలో ఇంగ్లీష్ జట్టు తో జరిగిన సుదీర్ఘ ఫార్మాట్లో అతడు బీభత్సమైన ప్రదర్శన చేశాడు. ఒకవేళ అతడు గనుక ఇదే ఊపులో తుది పోరులో కంగారుల మీద కొనసాగిస్తే మాత్రం సఫారీలకు తిరుగు ఉండదు..ఎన్ గిడి, యాన్సెన్ కూడా పేస్ భారాన్ని మోస్తున్నారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఏమేరకు ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తి కరం.
తుది జట్లు ఇవే (అంచనా)
ఆస్ట్రేలియా
ఉస్మాన్ ఖవాజా, గ్రీన్, లబూషేన్, స్మిత్, హెడ్, వెబ్ స్టర్, క్యారీ, కమిన్స్(కెప్టెన్), లయన్, స్టార్క్, హేజిల్ వుడ్.
సౌత్ ఆఫ్రికా
మార్క్రం, ముల్డర్, రికెల్టన్, బవుమా(కెప్టెన్), స్టబ్స్, బెండిగం, వేరే యిన్, యాన్సన్, కేశవ్, ఎన్ గిడి, రబాడ.
మైదానం ఎలా ఉందంటే..
లార్డ్స్ లో వాతావరణం పొడిగా ఉంది. ఇటీవల వర్షాలు కురిసినప్పటికీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొద్దిరోజులుగా రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్లు స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేశారు.. ఈ మైదానం సామర్థ్యం 30,000.. ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.
ఈ మ్యాచ్ లైవ్ ను టీవీలలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్మార్ట్ ఫోన్ లలో జియో హాట్ స్టార్ లో చూడొచ్చు.