spot_img
Homeజాతీయ వార్తలుWest Bengal politics : మోడీ-షా వ్యూహం పనిచేసింది.. మమత బెంగాల్ కోట బద్దలైంది..

West Bengal politics : మోడీ-షా వ్యూహం పనిచేసింది.. మమత బెంగాల్ కోట బద్దలైంది..

West Bengal politics : పశ్చిమ బెంగాల్.. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. ఈ కంచుకోట ను బద్దలు కొట్టడానికి మమతా బెనర్జీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. బెంగాల్ ప్రజలకు తనును తాను దీదీ గా పరిచయం చేసుకున్నారు. టాటా నానో ఫ్యాక్టరీ ఏర్పాటు సందర్భంగా ఆందోళన చేసి.. బెంగాల్ ప్రజలకు ఆశా దీపం లాగా కనిపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మమత విజయ దుందుభి మోగించారు. అనంతరం వరుస ఎన్నికల్లో విజయాలు సాధించి బెంగాల్ అంటే మమత.. మమతా అంటే బెంగాల్ గా మార్చుకున్నారు. దశాబ్దాలుగా బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిస్టులకు చరమగీతం పాడారు. కనీసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేని పరిస్థితిని తీసుకొచ్చారు.

మమత ప్రారంభంలో ఉన్నట్టుగా ఉంటే బెంగాల్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. కమ్యూనిస్టులు అరాచకం చేశారంటే.. అంతకుమించిన దారుణాలు మమత చేశారు. శారద కుంభకోణం నుంచి మొదలు పెడితే.. మెడికల్ విద్యార్థి హత్య వరకు ప్రతి విషయంలోనూ మమత తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. అల్లుడికి పెత్తనం మొత్తం ఇచ్చి బెంగాల్ రాష్ట్రాన్ని తన సొంత ఆస్తి లాగా మార్చేసుకున్నారు. చివరికి ప్రభుత్వ వేతనంతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిపక్షాలకు నరకం చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మమత చేసిన దారుణాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బెంగాల్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. కేంద్ర మంత్రులపై దాడులు కూడా చేయించారు.

పాపి చిరాయువు అన్నట్టుగా.. మమతా బెనర్జీ చేసిన పాపాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడడం మొదలుపెట్టాయి. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చి.. భారత పౌరసత్వం పొందిన బంగ్లాదేశ్ ఓటర్ల మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో మమత బాగోతం బయటపడడం మొదలైంది. బంగ్లాదేశీయుల సహకారంతో పశ్చిమబెంగాల్ లో అధికారంలోకి వచ్చిన మమత.. నరేంద్ర మోడీ, అమిత్ షా మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన వారిని ఈ దేశ పౌరులని చెప్పడం ప్రారంభించారు. వారికి కల్పించిన ఓటు హక్కును తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇవన్నీ కూడా బెంగాల్ ప్రజల్లో ఆలోచన ను రేకెత్తించాయి. బంగ్లాదేశ్ నుంచి భారీగా వస్తున్న వలసల వల్ల బెంగాల్ మొత్తం నాశనం అవుతుందని అక్కడి ప్రజలకు అర్థమైంది. దీంతో ప్రజలు మార్పును కోరుకున్నారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల అడుగులు పడటంతో బెంగాల్ రాష్ట్రంలో మార్పు తద్యమని అనిపించింది.

గత ఎన్నికల్లో కాళ్లకు కట్టుకట్టుకొని.. మహానటి లాగా ప్రదర్శన చేసిన మమత.. ఈసారి ఆ పని చేయలేకపోయింది. ఎందుకంటే ఆ పని కంటే ముందుగానే బిజెపి పెద్దలు బెంగాల్ రాష్ట్రంలో స్వచ్ఛభారత్ మొదలుపెట్టారు. ఫలితంగా ఇన్నాళ్లపాటు మమతకు ఆయుధంగా ఉన్న వర్గాలు దూరమయ్యాయి. అసలు వారి ఓటు హక్కును కేంద్రం పక్కనపెట్టింది. వారందరినీ కూడా బంగ్లాదేశ్ కు తన్ని తరిమేసింది. దీంతో మమతకు వాస్తవం అర్థమైంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మోడీ షా వ్యూహం ముందు ఈసారి మమత తలవంచింది.. అప్రతిహతంగా పరిపాలించిన బెంగాల్ రాష్ట్రాన్ని దూరం చేసుకుంది. అందుకే యద్భావం తద్భవతి అని పెద్దలు అంటారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper