Homeజాతీయ వార్తలుHindu sentiments politics India : దేవతామూర్తులు ఆగ్రహం.. ఈ ముఖ్యమంత్రుల పీఠాలు కూలిపోయాయి..

Hindu sentiments politics India : దేవతామూర్తులు ఆగ్రహం.. ఈ ముఖ్యమంత్రుల పీఠాలు కూలిపోయాయి..

Hindu sentiments politics India : ఒకడు సనాతన ధర్మాన్ని టైఫాయిడ్ తో పోల్చి చెబుతాడు. ఇంకొకడేమో శబరిమల ఆలయంలో బంగారాన్ని తస్కరించిన ముఠాకు అండగా ఉంటాడు. ఇంకొకరేమో కాళీమాతకు అత్యంత ఇష్టమైన దసరా ఉత్సవాలలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. మెజారిటీ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. చివరికి ఎన్నికల్లో ప్రజల చేతిలో చావు దెబ్బ తిన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు.. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన కుమారుడు ఉదయనిది స్టాలిన్ షాడో ముఖ్యమంత్రిగా కొనసాగే వారు. ఉదయనిధికి మొదటి నుంచి కూడా తల బిరుసు. ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. ముఖ్యంగా సనాతన ధర్మం మీద లేకి వ్యాఖ్యలు చేసేవాడు. ఆమధ్య ఓ సభలో సనాతన ధర్మాన్ని జాతికి పట్టిన టైఫాయిడ్ వైరస్ అని ఆరోపించాడు. దీనిపై కోర్టులు ఆక్షేపించాయి. పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదని హెచ్చరించాయి. అయినప్పటికీ ఉదయనిధి తన ధోరణి మార్చుకోలేదు.

కేరళ రాష్ట్రంలో శబరిమల ఆలయంలో బంగారాన్ని తరస్కరించింది ఓ ముఠా. అదంతా కూడా ఘనత వహించిన విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. పైగా ఈ దారుణాన్ని విజయన్ ప్రభుత్వం తప్పు పట్టలేదు. విచారణ విషయంలో వేగంగా అడుగులు వేయలేదు. పైగా ఆ మధ్య శబరిమల లో మహిళలు అడుగుపెట్టాలని జరిగిన ఉద్యమానికి తెరవెనక ప్రోత్సాహం అందించింది. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా వ్యవహరించింది. శబరిమల విషయంలో విజయన్ ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసింది. చివరికి అయ్యప్ప స్వామి ఆగ్రహం ముందు ఇప్పుడు తలవంచింది.

బెంగాల్ రాష్ట్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల సమయంలో బెంగాల్ రాష్ట్రం అమ్మవారి నామస్మరణతో ఊగిపోతుంది. బెంగాల్ వ్యాప్తంగా మండపాలు ఏర్పాటు అవుతాయి. అమ్మవారి విగ్రహాలు కొలువుదిరి.. భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటాయి. ఇంతటి నేపథ్యం ఉన్న బెంగాల్ రాష్ట్రంలో దసరా ఉత్సవాల సమయంలో మమత బెనర్జీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. ఓవర్గం మెప్పు పొందడానికి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టారు. చివరికి కాళీమాత ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లేకుండా చేశారు.

ఇప్పుడు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. దేవతామూర్తులకు ఆగ్రహం కలిగితే ఏ స్థాయిలో ఉంటుందో చవిచూస్తున్నారు.. తమిళనాడులో మధుర మీనాక్షి ఉంది. శబరిమలలో అయ్యప్ప స్వామి.. ఆయన మాతృమూర్తి పార్వతి దేవి ఉంది. బెంగాల్లో కాళికాదేవి ఉంది. ఓ స్థాయి వరకు ఈ దేవతమూర్తులు పాపుల దుర్మార్గాలను చూస్తారు. స్థాయి దాటిపోయిన తర్వాత శిక్షిస్తారు. అసెంబ్లీ మాత్రం కామాఖ్యాదేవి ఈసారి కూడా శాంతించింది. అధికారంలోకి బిజెపి వచ్చి.. అక్కడి రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని ఆశీస్సులు అందించింది.. ఇప్పటికైనా సనాతన ధర్మాన్ని డీఎంకే గౌరవించాలి. దసరా ఉత్సవాలను భక్తితో మాత్రమే మమత చూడాలి. శబరిమల అయ్యప్ప క్షేత్రం గొప్పతనాన్ని విజయన్ అంగీకరించాలి. కాదు కూడదు అనుకుంటే.. మరోసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఎందుకంటే దేవుళ్ళతో పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ దేశంలో బాగుపడ్డ దాఖలాలు లేవు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular