spot_img
Homeలైఫ్ స్టైల్Best books to become millionaire: మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ పుస్తకాలు చదవండి..

Best books to become millionaire: మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ పుస్తకాలు చదవండి..

Best books to become millionaire: ఆర్థికంగా స్థిరపడటం.. సంపదను సృష్టించాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారానే ఇవి సాధ్యమవ్వవు. సరైన ఆలోచనా విధానం, క్రమశిక్షణ, పెట్టుబడి జ్ఞానం ఈ మూడు కలిసివస్తేనే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ కలుగుతుంది. ఈ సక్సెస్ మంత్రను కొంతమంది మాత్రమే అలవర్చుకుంటున్నారు. అలాంటి వారు తమ సూత్రాలను పుస్తకాల రూపంలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన ఐదు పుస్తకాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

Rich Dad Poor Dad:
ఈ పుస్తకాన్ని Robert Kiyosaki రచించారు. సంపద అంటే ఏమిటి? ధనికులు ఎలా ఆలోచిస్తారు? అనే విషయాలను చాలా సులభంగా వివరించిందీ పుస్తకం. ఆస్తులు (Assets) సంపాదించాలి, బాధ్యతలు (Liabilities) తగ్గించాలి అనే మూలసూత్రాన్ని ఇందులో చెప్పబడింది. ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా, పెట్టుబడులు, వ్యాపారం ద్వారా పాసివ్ ఇన్‌కమ్ సృష్టించడం ఎంత ముఖ్యమో ఈ పుస్తకం బోధిస్తుంది.

One Up on Wall StreetG:
దీనిని ప్రముఖ ఇన్వెస్టర్ Peter Lynch రచించారు. స్టాక్ మార్కెట్‌లో విజయవంతంగా పెట్టుబడి పెట్టాలంటే పెద్ద పెద్ద విశ్లేషణలు అవసరం లేదని, మన చుట్టూ ఉన్న కంపెనీలను గమనించడం ద్వారా కూడా మంచి అవకాశాలను గుర్తించవచ్చని ఈ పుస్తకం చెబుతుంది. సాధారణ ఇన్వెస్టర్ కూడా సరైన పరిశీలనతో మంచి లాభాలు పొందగలడని ఇందులో స్పష్టంగా చూపించారు.

The Psychology of Money :
Morgan Housel అనే రచయిత ఈ పుస్తకంలో డబ్బుతో మన భావోద్వేగాల సంబంధాన్ని అద్భుతంగా వివరించారు. డబ్బు నిర్వహణలో లాజిక్ కంటే బిహేవియర్ (ప్రవర్తన) ఎంతో కీలకమని ఇందులో చెబుతారు. ఓర్పు, క్రమశిక్షణ, దీర్ఘకాల దృష్టి ఉంటేనే సంపద పెరుగుతుందని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది.

The Intelligent Investor:
Benjamin Graham రచించారు. ఇది పెట్టుబడిదారుల కోసం ఒక బైబిల్ లాంటి పుస్తకంగా భావిస్తారు. విలువ ఆధారిత పెట్టుబడులు (Value Investing), మార్కెట్ ఒడుదొడుకులను ఎలా ఎదుర్కోవాలి? రిస్క్‌ను ఎలా నియంత్రించాలి? వంటి అంశాలను ఇందులో లోతుగా వివరించారు. Warren Buffett కూడా ఈ పుస్తకాన్ని అత్యంత ప్రభావవంతమైనదిగా పేర్కొన్నారు.

Your Money or Your Life :
ఈ పుస్తకాన్ని Vicki Robin ,Joe Dominguez కలిసి రచించారు. డబ్బు కోసం జీవించాలా? లేక జీవితం కోసం డబ్బును ఉపయోగించాలా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే పుస్తకం ఇది. ఖర్చులను నియంత్రించడం, సేవింగ్స్ పెంచడం, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం వంటి విషయాల్లో ఇది మార్గదర్శకంగా ఉంటుంది.

ఈ ఐదు పుస్తకాలు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా నిర్వహించాలి? ఎలా పెంచుకోవాలి? అనే పూర్తి దృక్పథాన్ని మనకు అందిస్తాయి. ఈ పుస్తకాలను చదవడం ద్వారా ఆర్థికంగా బలమైన భవిష్యత్తు కోసం సరైన పునాది వేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper