HomeతెలంగాణVande Mataram controversy : వందేమాతరం పాడుతుండగా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై...

Vande Mataram controversy : వందేమాతరం పాడుతుండగా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై వివాదం

Vande Mataram controversy : వారికి ఈ దేశమంటే లెక్క ఉండదు. జాతీయ పతాకం అంటే గౌరవం ఉండదు. జాతీయగీతం ఆలపించాలనే సోయి ఉండదు. వారికి హైదరాబాద్ నగరం సామంతరాజ్యం. ముఖ్యంగా పాతబస్తీ ఇష్టారాజ్యం. వారిని ఏ వ్యవస్థ కూడా ప్రభావితం చేయలేదు. ఇప్పటివరకు పని చేస్తున్న ముఖ్యమంత్రులు మొత్తం వారికి సపోర్ట్ గానే ఉన్నారు.. ఇలానే కదా బిజెపి నేతలు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఉద్దేశించి విమర్శలు చేసేది. అవి విమర్శలు మాత్రమే కాదు.. వాస్తవాలని […]

Vande Mataram controversy : వారికి ఈ దేశమంటే లెక్క ఉండదు. జాతీయ పతాకం అంటే గౌరవం ఉండదు. జాతీయగీతం ఆలపించాలనే సోయి ఉండదు. వారికి హైదరాబాద్ నగరం సామంతరాజ్యం. ముఖ్యంగా పాతబస్తీ ఇష్టారాజ్యం. వారిని ఏ వ్యవస్థ కూడా ప్రభావితం చేయలేదు. ఇప్పటివరకు పని చేస్తున్న ముఖ్యమంత్రులు మొత్తం వారికి సపోర్ట్ గానే ఉన్నారు.. ఇలానే కదా బిజెపి నేతలు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఉద్దేశించి విమర్శలు చేసేది.

అవి విమర్శలు మాత్రమే కాదు.. వాస్తవాలని తేలిపోయింది. అప్పట్లో ఎమ్ఐఎం నేత అక్బరుద్దీన్ ఓ సభలో మాట్లాడుతూ పది నిమిషాల సమయం ఇస్తే చాలు *** లను చం***** హెచ్చరించారు. ఆ వ్యాఖ్యల తర్వాత ఎటువంటి పరిస్థితులు తెలంగాణలో చోటుచేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంఐఎం నేతల వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపి కట్టే ది మరొక దారి అన్నట్టుగా ఆ నేతల తీరు ఉంటుంది. అందువల్లేవారు వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాస్పద పనులు చేస్తూ ఉంటారు.

తాజాగా హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ వచ్చారు. గవర్నర్ వచ్చిన సమయంలో వందేమాతరం గేయాన్ని ప్రసారం చేశారు. మిగతా ఎమ్మెల్యేలు.. మంత్రులు ఆ గేయాన్ని ఆలపిస్తూ ఉండగా.. ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళిపోయారు. సభ నుంచి అలా వెళ్లిపోవడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వందేమాతరం గేయం ఆలపిస్తుంటే.. అలా వెళ్లిపోవడాన్ని ఎందుకు క్షమించాలని బిజెపి నేతలు అంటున్నారు.

“ఈ దేశానికి చరిత్ర ఉంది. స్వాతంత్రం వెనుక గొప్ప త్యాగం ఉంది. జాతీయ గేయాల రూపకల్పన వెనక అద్భుతమైన సాహిత్యం దాగి ఉంది. జాతీయ గేయాలను ఆలపిస్తుంటే రోమాలు నిక్కబొడుస్తూ ఉంటాయి. అలాంటిది ఎంఐఎం నేతలు ఏమాత్రం పట్టింపు లేకుండా వెళ్లిపోవడం దారుణం. ఇది దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టు అని” బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper