Gavaskar on Kavya Maran : ది హండ్రెడ్ క్రికెట్ లీగ్ టోర్నీలో సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు కావ్య మారన్ యజమానిగా వ్యవహరిస్తోంది. ఈ జట్టు యాజమాన్యం ఇటీవల పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుంది. దీంతో దుమారం మొదలైంది. ఒకానొక దశలో ఐపీఎల్ నుంచి హైదరాబాద్ జట్టును బహిష్కరించాలని డిమాండ్ కూడా వ్యక్తం అయింది. మాజీ క్రికెటర్లు.. క్రికెట్ విశ్లేషకులు కావ్య మారన్ తీసుకొన్న నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో అగ్రహారం వ్యక్తం చేశారు.
కావ్య మారన్ వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. కావ్య అబ్రార్ అహ్మద్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “2008 నుంచి ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్లను నిషేధించాం. ముంబై ప్రాంతంలో జరిగిన పేలుళ్లకు ప్రధాన కారణం పాకిస్థాన్ ఉగ్రవాదులు. దీని వెనుక పాకిస్తాన్ దేశం హస్తముంది. పాకిస్తాన్ తీరువల్ల మన దేశం తీవ్రంగా నష్టపోయింది. అప్పటినుంచి పాకిస్తాన్ ప్లేయర్లను ipl లో ఆడించడం లేదు. పాకిస్తాన్ ప్లేయర్లకు ఫీజు చెల్లించడమంటే అది భారతీయుల రక్తం నుంచి సేకరించిందని గుర్తించుకోవాలని” సునీల్ గవాస్కర్ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
“ఆ టోర్నీ అనేది ఇతర దేశానికి సంబంధించినది అయినప్పటికీ.. అందులో మన దేశ ప్రజలకు సంబంధించిన వాటా ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి అందులో వాటా ఉంది కాబట్టి కచ్చితంగా మన దేశ ప్రజలు ఆ లీగ్ చూస్తూనే ఉంటారు. తద్వారా పరోక్షంగా ఆదాయం రావడానికి కృషి చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు అహ్మద్ లాంటి ఆటగాడికి చెల్లించేది భారతీయుల సొమ్మే కదా” అని సునీల్ గవాస్కర్ అన్నారు.
మరోవైపు సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కోచ్ వెటోరి మీద కూడా సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ” కోచ్ వెటోరి ఈ వ్యవహారం గురించి వేరే విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే అసలు విషయాలు అతడికి తెలియదు. యజమాన్యం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కొన్ని రకాల భావోద్వేగాలను గుర్తించాలి. మేనేజ్మెంట్ సూచన మేరకు అహ్మద్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. భారతీయుల మనోభావాల కంటే ఈ టోర్నీలో గెలవడం ముఖ్యమా” అని గవాస్కర్ ప్రశ్నించారు. మరోవైపు అహ్మద్ ను జట్టులోకి తీసుకున్న తర్వాత కెప్టెన్ వెటోరి విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి తాము ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్ రషీద్ ను తీసుకోవాలని అనుకున్నామని.. కానీ అహ్మద్ ను తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మధ్యలో తారీక్ ఉస్మాన్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు వివరించారు.