Homeబిజినెస్iPhone 16 Pro discount India : ఈ iPhone పై రూ.39,000 తగ్గింపు.. సిరీస్...

iPhone 16 Pro discount India : ఈ iPhone పై రూ.39,000 తగ్గింపు.. సిరీస్ ఏదంటే..

iPhone 16 Pro discount India : కాస్త ఖరీదు ఎక్కువైనా సరే iPhone దక్కించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం యాపిల్ కంపెనీ నుంచి కొత్త సిరీస్ ఏదైనా మార్కెట్లోకి వస్తుందంటే ముందే క్యూ కట్టడానికి రెడీ అవుతారు. అయితే కొంతమంది మరి ధర ఎక్కువగా ఉంటే వీటిని కొనలేక వెనుకడుగు వేస్తారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు యాపిల్ కంపెనీకి చెందిన ఫోన్ల విక్రయాల్లో గుడ్ న్యూస్ తెలుపుతూ ఉంటారు. తాజాగా జియో మార్ట్ నుంచి ఐఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ.39,000 తగ్గింపుతో ఇస్తోంది. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లతో పాటు కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అయినా కూడా ఈ మొబైల్ ను తక్కువ ధరకు ఇవ్వడంపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఐఫోన్ లో ఏ సిరీస్ తక్కువ ధరకు వస్తోంది?

Apple కంపెనీ నుంచి iPhone 16 Pro 2024 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చింది. ఇది రిలీజ్ అయినప్పుడు దీని ధర రూ.1,19,900 గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దీనిని జియో మార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.39,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.80,900 కే వస్తుంది. అయితే ఈ ఆఫర్ కొంత కాలం మాత్రమే ఉంటున్నట్లు జియో మార్క్ తెలిపింది. ఇంత తగ్గింపు ప్రకటించిన కూడా ఇందులో ఫీచర్స్ క్వాలిటీ గానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్ లో 6.3 అంగుళాల OLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో సిక్స్ కోర్ GPU A18 ప్రో చిప్ సెట్ ఉండనుంది. మిగతా ఫోన్ల కంటే 16 ప్రో 20% వేగవంతమైన పనితీరు కనిపిస్తుంది. బిజీగా ఉండే వారితో పాటు మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఈ వేగం సపోర్టుగా ఉంటుంది.

ఐఫోన్ 16 ప్రో మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 48 మెగాపిక్ సెల్ తో కూడిన ప్రధాన కెమెరాలు అమర్చారు. అలాగే 5 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పాటు టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఈ కెమెరాలతో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. విహారయాత్రలకు వెళ్లినప్పుడు.. స్నేహితులతో కలిసి ఫోటోలు దిగినప్పుడు ఇది చాలా అద్భుతమైన స్నాప్ ను అందిస్తుంది. ఈ మొబైల్ లో బ్యాటరీ 3582 mAh కెపాసిటీతో ఉండనుంది. ఈ బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో యాపిల్ ఇంటలిజెన్స్, ఫ్లోరైస్ వీడియో రికార్డింగ్, వేగవంతమైన డేటా బదిలీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular