Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలామంది బరువు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రకరకాల ఆహారం తినడం వల్ల అదనపు కొవ్వు పేరుకుపోవడంతో లావు అవుతున్నారు. అయితే బరువు తగ్గేందుకు కొంతమంది ప్రత్యేకంగా మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది వ్యాయామం చేస్తున్నారు. కానీ ఆహారం తీసుకునే విషయంలో మాత్రం ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవడం లేదు. దీంతో ఓవైపు వ్యాయామం చేస్తున్నా.. మరోవైపు బరువు తగ్గడం లేదు. అయితే కొందరు వైద్యులు సూచించిన ప్రకారం వ్యాయామం చేస్తూ.. సరైన డైట్ ప్లాన్ చేయడం వల్ల తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మరి డైట్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. వీటివల్ల మనసు ఉత్సాహంగా ఉండడం నిజమే. బరువు ఎక్కువగా ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే చక్కెర పదార్థం బరువును పెంచుతుంది. ఉదయం టీ కి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీ వల్ల ఎలాంటి టిఫిన్ శరీరంలోకి వెళ్ళదు. కానీ ఇందులో ఉండే కొన్ని పదార్థాల వల్ల అదనపు కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా చాలామంది ఎలాంటి ఆహారం తీసుకోరు. ఒకవేళ తీసుకున్న కూడా పూరి, బజ్జి, వడ వంటివి ఇష్టంగా తింటారు. అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పాలలో కార్న్ ఫ్లాక్స్ లేదా ఓట్స్ వేసుకోవడం చేయాలి. ఈ మిశ్రమం తాగడం వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరంగా ఉండదు. అయితే కొందరు ఉప్మా తినాలని కూడా ప్రయత్నిస్తారు. ఉప్మా తినడం వల్ల శరీరం లోకి ఎనర్జీ రాకుండా కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
సాయంత్రం కామన్ ఆహారం తీసుకోకుండా కూడా డైట్ ప్లాన్ చేయాలి. వీలైతే సాయంత్రం కూడా గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఇక రాత్రికి రైస్ తో కూడిన ఆహారం కాకుండా కిచిడి తయారు చేసుకోవాలి. ఈ కిచిడీలో ప్రోటీన్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కొన్ని వారాలపాటు ఇలా సాయంత్రం రైస్కు బదులు క్యారెట్, ఉల్లిపాయ వంటివి బ్రెడ్ మధ్యలో పెట్టి సాండ్విచ్ లాగా కూడా తీసుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు తమ బరువును చూసుకోకూడదు. ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో ఎలాంటి ఫలితం ఉండదు. వారం రోజుల తర్వాత ఇలాంటి డైట్ పాటించి ఆ తర్వాత చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫలితం లేకపోతే డైట్ మెనూ మార్చుకోవాలి. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి హెవీ ఫుడ్ తీసుకోకుండా కేవలం సూప్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి.
అయితే ఈ డైట్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు.. ప్రత్యేకంగా మెడిసిన్స్ వాడేవారు వైద్యుల సలహా మేరకు పాటించాలి. ఎందుకంటే వీరికి ప్రత్యేకంగా ఎనర్జీ అవసరం. డైట్ పాటించడం వల్ల శక్తిని కోల్పోయి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.