Homeలైఫ్ స్టైల్Rain Alert : నేడు వడగండ్ల వాన.. 8 జిల్లాలకు అలర్ట్‌

Rain Alert : నేడు వడగండ్ల వాన.. 8 జిల్లాలకు అలర్ట్‌

Rain Alert : తెలంగాణలో ఆదివారం వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో 8 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతోపాటు, గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఈ జిల్లాలకు అలర్ట్‌..
ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలో మూడు రోజులు వాతావరణ చల్లబడుతుందని ప్రకటించింది. అదే సమయంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అయితే రోజు రోజుకు వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దీంతో ఉదయం ఎండగా ఉంటూ.. సాయంత్రం అయ్యే సరికి వానలు కురుస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఆదివారం(ఏప్రిల్‌ 21న) రాష్ట్రంలోని కరీంనగర్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్‌కర్నూరల్, జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని ప్రకటిచింది.

ఏడు రోజులు వానలు..
ఈ 8 జిల్లాలతోపాటు రాబోయే 7 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో వడగండ్లు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

రైతుల ఆందోళన..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొన్నాయి. నీరందక చాలా జిల్లాల్లో యాసంగి పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు చివరి దశలో ఉన్న పంటలపై వడగండ్ల వానలు పడితే చేతికి వచ్చిన గింజలు నోటికి అందకుండా పోతాయని పేర్కొంటున్నారు. పంట పూర్తికాక, వాతావరణ శాఖ హెర్చరికలతో ఇనఫలంగా కోయలేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతులు కూడా చేతికి వచ్చిన కాయలు రాలిపోతాయని ఆందోళన చెందుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper