Chinnaswamy Stadium : బీభత్సమైన వర్షానికి వరద నీరు భారీగా రావడంతో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఒక్కసారిగా నిండిపోయింది. చూస్తుండగానే చెరువులాగా మారిపోయింది.. దీంతో అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న బెంగళూరు ప్లేయర్లు వర్షాన్ని ఆస్వాదించారు. ఇక బెంగళూరు జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్న టిమ్ డేవిడ్ చెరువులా మారిపోయిన మైదానాన్ని చూసి ఒక్కసారిగా చిన్నపిల్లోడైపోయాడు. వెంటనే తన జెర్సీ తొలగించి.. ఆ మైదానంలో స్నానం చేశాడు. వర్షం కురుస్తుంటే కేరింతలు కొట్టుకుంటూ మైదానం చుట్టూ పరుగులు పెట్టాడు. ఇక ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మేనేజ్మెంట్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది..” వర్షం బెంగళూరు నగరాన్ని ముంచెత్తింది. చిన్న స్వామి స్టేడియాన్ని ఇలా చేసింది. కళ్ళ ముందు నిండుగా నీరు కనిపిస్తున్న నేపథ్యంలో బెంగళూరు ప్లేయర్ టిమ్ డేవిడ్ చిన్నపిల్లాడయిపోయాడు. మైదానంలో నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేశాడు. అతడిని చూస్తుంటే ముచ్చటేస్తోందని” బెంగళూరు జట్టు తన పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.
Also Read : అతడు రాజులా అడుగు పెట్టాడు.. కీలక ట్వీట్ చేసిన ఆర్సీబీ
వరద నీరు బయటికి వెళ్లినప్పటికీ..
బెంగళూరులో గురువారం బీభత్సమైన వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా.. కుండ పోత వర్షం కురిసింది. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాదు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. వాస్తవానికి మే నెలలో వర్షాలు కురవడం అరుదైనప్పటికీ… ఈ సీజన్లో మాత్రం బెంగళూరులో తరచుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం కురిసింది. దాంతో ఓవర్లను కుదించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో బెంగళూరు పరాజయం పాలైంది. ఇప్పుడు మళ్లీ వర్షం కురవడంతో బెంగళూరు మైదానం చెరువును తలపిస్తోంది. వాస్తవానికి ఈ మైదానంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. పడ్డ చినుకు పడ్డట్టే బయటికి వెళ్లే మార్గం ఉంది. అయితే భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో.. డ్రైనేజీ పొంగిపొర్లిపోవడంతో.. నీరు మొత్తం స్టేడియాన్ని కమ్మేసింది. అందువల్లే చిన్న స్వామి స్టేడియం కాస్త చెరువైంది. ఇన్ని రోజులపాటు విపరీతమైన ఎండ కొట్టడం.. ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఇబ్బందిపడిన ప్లేయర్లు ఆ వర్షాన్ని ఆస్వాదించారు. అందులో బెంగళూరు ప్లేయర్ టిమ్ డేవిడ్ ముందు వరుసలో ఉన్నాడు. వెంటనే తన జెర్సీని తొలగించి మైదానంలోకి ప్రవేశించాడు. ఇష్టానుసారంగా ఈత కొట్టాడు. ఇక ఎందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, బెంగళూరు ఈ సీజన్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఈసారి కూడా ప్లే ఆఫ్ రేసుకు చేరువైంది. ఇక శనివారం రీస్టార్ట్ అయ్యే ఐపిఎల్ లో బెంగళూరు తన తొలి మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో తలపడుతుంది.
Tim David enjoying the Bengaluru rain. pic.twitter.com/nOKhZhHukO
— Johns. (@CricCrazyJohns) May 16, 2025