Homeక్రీడలుAyush Mhatre : ఎవడ్రా బ్రేవిస్.. ఆయుష్ మాత్రే వచ్చాడు.. లెక్క సరి చేశాడు.. మామూలు...

Ayush Mhatre : ఎవడ్రా బ్రేవిస్.. ఆయుష్ మాత్రే వచ్చాడు.. లెక్క సరి చేశాడు.. మామూలు రికార్డు కాదిదీ

Ayush Mhatre : ఏం కొట్టుడు అది. ఏం బ్యాటింగ్ అది.. ఎవరిని వదిలిపెట్టలేదు. బౌండరీ మీటర్ చిన్నబోయింది. బంతి పగిలిపోయేలా కనిపించింది. బౌలర్లకు అలుపు వచ్చింది. వ్యాఖ్యాతలకు చెప్పి చెప్పి ఆయాసం వచ్చింది. అలా సాగిపోయింది అతని బ్యాటింగ్. అలాగని అతడేమీ తోపు ఆటగాడు కాదు. కానీ.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్ అన్నట్టుగా ఆడాడు. ఫలితంగా చెన్నై జట్టుకు తిరుగులేని ఆధి పత్యాన్ని అందించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టుకు వైభవ్ […]

Ayush Mhatre : ఏం కొట్టుడు అది. ఏం బ్యాటింగ్ అది.. ఎవరిని వదిలిపెట్టలేదు. బౌండరీ మీటర్ చిన్నబోయింది. బంతి పగిలిపోయేలా కనిపించింది. బౌలర్లకు అలుపు వచ్చింది. వ్యాఖ్యాతలకు చెప్పి చెప్పి ఆయాసం వచ్చింది. అలా సాగిపోయింది అతని బ్యాటింగ్. అలాగని అతడేమీ తోపు ఆటగాడు కాదు. కానీ.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్ అన్నట్టుగా ఆడాడు. ఫలితంగా చెన్నై జట్టుకు తిరుగులేని ఆధి పత్యాన్ని అందించాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్య వంశీ ఉన్నాడు. ఇప్పుడు చెన్నై జట్టుకు ఆయుష్ మాత్రే ఆ లోటును భర్తీ చేశాడు. పంజాబ్ జట్టుతో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్లో అతడు ఏకంగా 73 పరుగులు చేశాడు. 43 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సహాయంతో 73 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 169.77 గా నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఆయుష్ సరికొత్త రికార్డులను సృష్టించాడు.. 19 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో రెండు అర్థ శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో వైభవ్ సూర్య వంశీ మూడు అర్థ శతకాలతో తొలి స్థానంలో.. పృథ్విష రెండు అర్థ సెంచరీలతో రెండవ స్థానంలో.. ఆయుష్ రెండు అర్థ పెంచడానికి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెన్నై మైదానంలో 50 పరుగులు చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా ఆయుష్ రికార్డు సృష్టించాడు. 18 సంవత్సరాల 261 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు.

14 పరుగులకే సంజు వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న చెన్నై జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచాడు ఆయుష్. కెప్టెన్ గైక్వాడ్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 96 పరుగులు జోడించాడు. గైక్వాడ్ జస్ట్ స్ట్రైక్ రొటేట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. సింహభాగం బ్యాటింగ్ మొత్తం ఆయుష్ తీసుకున్నాడు.. పంజాబ్ బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటిస్తూ దుమ్మురేపాడు. ఫలితంగా చెన్నై మైదానం మొత్తం ఆయుష్ నామస్మరణతో మారు మోగిపోయింది. దురదృష్టవశాత్తు విజయకుమార్ బౌలింగ్లో చాహల్ పట్టిన క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడు ఆయుష్. ఒకవేళ ఆ క్యాచ్ గనుక మిస్ అయి ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. వాస్తవానికి ఆయుష్ నిలబడకపోయి ఉండి ఉంటే చెన్నై జట్టు ఈ స్థాయి స్కోర్ చేసి ఉండేది కాదు.

ఆయుష్ వన్ డౌన్ లో వచ్చిన తర్వాత పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో బ్రేవిస్ ఉండి ఉంటే బాగుండేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవడ్రా బ్రేవిస్ .. ఇక్కడ ఉన్నది ఆయుష్.. అన్నట్టుగా మాత్రే తన బ్యాటింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేసి.. పంజాబ్ జట్టు బౌలర్ల మీద మీసం మేలేసి ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper