Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: మరో క్రేజీ పాన్ ఇండియన్ మూవీ లో సాయి ధరమ్ తేజ్.....

Sai Dharam Tej: మరో క్రేజీ పాన్ ఇండియన్ మూవీ లో సాయి ధరమ్ తేజ్.. ప్లానింగ్ మామూలుగా లేదుగా..

Sai Dharam Tej: ‘విరూపాక్ష’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తో మంచి కం బ్యాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), ఆ తర్వాత ‘బ్రో’ సినిమాతో పర్వాలేదు అనిపించాడు. కానీ ఆ సినిమా తర్వాత మాత్రం తన కెరీర్ ని వేరే లెవెల్ లో ప్లాన్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక మీదట చేస్తే పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యాడని ఆయన లైనప్ ని చూస్తేనే […]

Sai Dharam Tej: ‘విరూపాక్ష’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తో మంచి కం బ్యాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), ఆ తర్వాత ‘బ్రో’ సినిమాతో పర్వాలేదు అనిపించాడు. కానీ ఆ సినిమా తర్వాత మాత్రం తన కెరీర్ ని వేరే లెవెల్ లో ప్లాన్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక మీదట చేస్తే పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యాడని ఆయన లైనప్ ని చూస్తేనే అర్థం అవుతోంది. ఇప్పటికే ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించినప్పటికీ , ఒక సరికొత్త వరల్డ్ లో ఈ సినిమా స్టోరీ సెటప్ ని ఏర్పాటు చేయడం వల్ల , ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే , నేడు మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ‘క’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సుజిత్ , సందీప్ లు సాయి ధరమ్ తేజ్ తో సరికొత్త సినిమా చేయబోతున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ని ఆడియన్స్ కి అందించిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ‘క’ మూవీ కాన్సెప్ట్ ని చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. అప్పటి వరకు అలాంటి సబ్జెక్టు మీద ఇండస్ట్రీ లో ఒక్క సినిమా కూడా రాలేదు. మళ్లీ అలాంటి సబ్జెక్టు తోనే మన ముందుకు రాబోతున్నారట ఈ ఇద్దరు డైరెక్టర్లు. త్వరలోనే ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో రెండు నెలల సమయం పట్టొచ్చు.

అయితే మెగా అభిమానులు మాత్రం సాయి ధరమ్ తేజ్ పై ఫైర్ ఉన్నారు. స్టార్ హీరోలు ఇప్పటికే సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తూ , టాలీవుడ్ లో మనీ రొటేషన్ లేకుండా చేస్తున్నారు. మీలాంటి యంగ్ హీరోలు కూడా ఒక్కో సినిమా చేయడానికి ఏళ్ళ తరబడి సమయం తీసుకుంటే , ఇక ఇండస్ట్రీ పరిస్థితి ఏమి అవుతుంది?..’సంబరాల ఎటి గట్టు’ చిత్రాన్ని ఎప్పుడో 2024 సెప్టెంబర్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. 2026 కూడా వచ్చి మూడు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమా అంటురు , ఇదెప్పుడు విడుదల అవుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper