Amaravati capital news : అమరావతి( Amravati capital ) రాజధాని కి మహర్దశ. కూటమి రాకతో అరణ్యవాసం నుంచి విముక్తి పొందినట్టు అయింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తిరిగి పట్టాభిషేకం చేసుకుంది. అప్పటినుంచి అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. క్వాంటం వ్యాలీ వంటి అద్భుత టెక్నాలజీ నిర్మాణాలు అమరావతికి తరలివచ్చాయి. బిట్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అమరావతిలో కొలువుతీరుతున్నాయి. కాజాగా ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇలా అడుగడుగునా అమరావతికి మంచి రోజులు కనిపిస్తూ వస్తున్నాయి.
* విష ప్రచారాలకు..
అమరావతి రాజధానిపై ఎన్నో కుట్రలు జరిగాయి. ఎన్నెన్నో విష ప్రచారాలు కొనసాగాయి. వాటన్నింటికీ చెక్ చెబుతూ అమరావతి రాజధాని ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. దక్షిణాది కేంద్రంగా నిర్మించే రెండు హైస్పీడ్ రైలు కారిడార్లకు అమరావతి కేంద్ర బిందువు కానుంది. మొదటి కారిడార్ అమరావతి నుంచి గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీ సిటీ మీదుగా హైదరాబాద్- చెన్నైకి కలపనుంది. రెండో కారిడార్ నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారు పేట, బెంగళూరు, మండ్యా మీదుగా మైసూర్ వరకు నడుస్తుంది. చంద్రబాబు విన్నపం మేరకే కేంద్రం ఈ రైలు కారిడార్లను అమరావతికి అనుసంధానం చేసింది.
* రైలు రవాణా పాత్ర కీలకం..
ఏ నగర అభివృద్ధిలోనైనా రైలు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హై స్పీడ్ కారిడార్ల తో అనుసంధానం చేయడం వల్ల అమరావతి ముఖ చిత్రం మారనుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మైసూర్ వంటి మహా నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు దోహదపడుతుంది. రవాణా మార్గం మెరుగ్గా ఉంటేనే పెట్టుబడిదారులు ముందుకు వచ్చేది. ఒక కొత్త నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇతర నగరాలతో పోటీపడి ముందుకెళ్లాల్సి ఉంటుంది. కేవలం అమరావతి పాలనా కేంద్రంగానే కాదు. ఆర్థిక ఇంజన్ గా కూడా మారాలి. దానికి ఈ హై స్పీడ్ రైల్ క్యారిడార్లు ఎంతగానో దోహదం చేస్తాయి అన్నమాట.