adivi sesh controversy : మన టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో ఒకరు అడివి శేష్(Adivi Sesh). క్యారెక్టర్ ఆర్టీసీటుగా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన , ఆ తర్వాత హీరో గా మారి సాధించిన విజయాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్, హిట్ 2 , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో సూపర్ హిట్ సినిమాలను టాలీవుడ్ కి అందించాడు. అయితే ‘హిట్ 2’ తర్వాత అడివి శేష్ నాలుగేళ్ల గ్యాప్ ఇచ్చాడు. ఇంతటి సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నుండి రాబోతున్న చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie). ఏప్రిల్ 10 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో అడివి శేష్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా ఆయన ఒక యంగ్ నటుడు ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు సంచలనం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ ‘ఒక నటుడు గురించి మీతో చెప్పాలి. అతని పేరు ఎత్తడం ఇష్టం లేదు. కానీ మా నిర్మాతల ద్వారా అతను నాకు పరిచయం అయ్యాడు. అతన్ని కలిసినప్పుడు శేష్ నువ్వెప్పుడూ నాలాగా పెద్ద సినిమా చేస్తావు? అని అడిగాడు. తెలుగు లో చెప్తే అతను ఎవరో అర్థం అయిపోతాది, అందుకే ఇంగ్లీష్ లో చెప్తున్నాను. అతను అలా మాట్లాడగానే నీయమ్మ కుళ్ళు బుద్ధి నువ్వును అని అనుకున్నాను. ఇప్పటికీ కూడా ఇదేమి పిల్ల బుద్ధి. ఇప్పుడు యంగ్ హీరోల్లో అందరికంటే నేను తోపు అయిపోతే , ఆ తర్వాత 6 మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నారు , వాళ్ళని దాటాలి , వాళ్ళని దాటిన తర్వాత చిరంజీవి , రజినీకాంత్ వంటి వారు ఉంటారు , వాళ్ళని దాటాలి, ఆ తర్వాత కింగ్ ఖాన్ ని దాటాలి, ఆయనకంటే పెద్ద అయినటువంటి తాం క్రూజ్ ని దాటాలి. ఇవన్నీ కాకుండా మార్స్ గ్రహం లోకి వెళ్లి అక్కడ ఎవరినైనా దాటాలి, ఇలా పోల్చి చూసుకుంటూ పోతే ఎవరితో పోటీ పడాలి’ అంటూ సదరు యంగ్ హీరో కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఇంతకీ అడివి శేష్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడు..?, కచ్చితంగా హీరో నిఖిల్ ని ఉద్దేశించి చేసి ఉంటాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తర్వాత నిఖిల్ లో చాలా యాటిట్యూడ్ పెరిగిందని, ఇలా చాలా మంది హీరోలతో ఆయన తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని, అలా అడివి శేష్ ముందు కూడా యాటిట్యూడ్ చూపించి ఉంటాడని అంటున్నారు. మరి అడివి శేష్ నిజంగానే నిఖిల్ ని ఉద్దేశించి మాట్లాడాడా ?, లేదా వేరే హీరో ని ఉద్దేశించి మాట్లాడాడా అనేది చూడాలి.